జడ్చర్ల కు సమీపంలో ఉన్న దేవుని గుట్ట తండా లో ఇటుక బట్టి నిర్వహించే మోత్య నాయక్ తెల్లవారుజామున 5 గంటల సమయంలో తమ కూలీలు నిద్రించే గుడిసెలో పెద్ద నాగుపాము ఉన్నట్టు గుర్తించారు. అనంతరం డా. బి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర సహయాచార్యుడు డా. సదాశివయ్య కు సమాచారం అందించారు.
సదాశివయ్య అక్కడికి చేరుకుని ఆ నాగుపామును పట్టుకున్నారు. ఈ పాము సుమారు 6 అడుగుల పొడవు ఉందని, సుమారుగా 12 నుండి 15 సంవత్సరాల వయసు వుండే అవకాశం ఉందని సదాశివయ్య తెలిపారు. ఇది ఆడ నాగుపాము అని ఇంత పెద్ద పాములు జనావాసాల్లోకి రావడం చాలా అరుదైనదని తెలిపారు. దీనిని అటవీప్రాంతంలో వదిలేయనున్నట్టు తెలిపారు
ప్రజలెవ్వరు పాములను చూసి భయబ్రాంతులకు గురికాకూడదని తమకు తెలియజేస్తే వాటిని సురక్షితంగా అడవుల్లో వదిలేస్తామని తెలిపారు.
పాముల గురించి అక్కడున్న కూలీలకు తండా వాసులకు పాములపైన అవగాహన కల్పించారు.