నిర్లక్ష్యానికి పరాకాష్ఠ.. రోగికి ‘O’ పాజిటివ్‌కు బదులు ‘B’ పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ ఎక్కించిన వైద్యులు

 నిర్లక్ష్యానికి పరాకాష్ఠ.. రోగికి ‘O’ పాజిటివ్‌కు బదులు ‘B’ పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ ఎక్కించిన వైద్యులు



వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా ఓ రోగికి ఒక గ్రూపు రక్తానికి బదులుగా మరో గ్రూపు రక్తం ఎక్కించారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురానికి చెందిన జ్యోతి (34) జ్వరం, శ్వాసకోశ సమస్యతో బాధపడుంది. వైద్యులు ఆమెకు రక్తం ఎక్కించాలని చెప్పడంతో శాంపిల్‌ తీసి రక్తనిధి కేంద్రానికి పంపించారు. అయితే ఆమెది ‘ఓ’ పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌గా నిర్ధారనైంది. అయితే జూనియర్‌ డాక్టర్లు సెప్టెంబర్‌ 18న ఆమెది ‘ఓ’ పాజిటివ్‌ బ్లడ్‌ అయితే ఎంత చెప్పినా వినిపించుకోకుండా ‘బీ’ పాజిటివ్‌ బ్లడ్‌ ప్యాకెట్‌ ఎక్కించారు. దీంతో జ్యోతికి కడుపులో నొప్పి, విరేచనాలు మొదలయ్యాయి. శనివారం మరో ప్యాకెట్‌ రక్తం ఎక్కించాల్సి ఉండగా ఆమె బ్లడ్‌గ్రూప్‌ మరోమారు టెస్ట్‌ చేయగా ఈ వ్యవహారం బయటపడింది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow