జడ్చర్ల: ముందర వెళుతున్న లారీని వెనుక నుండి
ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జడ్చర్ల లోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
జడ్చర్ల పట్టణ సీఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం..
బాలనగర్ మండలం పెద్ద బాయి తండాకు చెందిన నరేష్ (22) తన వృత్తిరీత్యా సెంట్రింగ్ పనులు చేస్తూ ఉంటాడని, గత 20 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ధర్మవరంలో సెంట్రింగ్ పనుల కోసం వెళ్లి పనులు ముగించుకొని శుక్రవారం జడ్చర్లకు చేరుకున్నాడని, జడ్చర్ల నుండి తన ద్విచక్ర వాహనంపై తన సొంత గ్రామమైన పెద్దబ్బాయి తాండకు బయలుదేరగా జడ్చర్ల పట్టణంలోని కాకరమ్మపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న ఫ్లైఓవర్ పై ముందర వెళుతున్న లారీని రాజేష్ ద్విచక్ర వాహనం వెనుక నుండి ఢీకొనడంతో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తల్లి సారావత్ అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు
44వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగిందని ఫోన్ కాల్ రావడంతో అక్కడికి చేరుకున్న జడ్చర్ల 108 వాహనం సిబ్బంది ప్రమాదంలో గాయపడిన రాజేష్ను పరిశీలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు గుర్తించారు. అతని ఆధారాలు ఇంటి అడ్రస్ కొరకు అతని జేబులను సరి చూడగా అతని వద్ద 50 వేల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించిన జడ్చర్ల 108 ఈ ఎం టీ శివారెడ్డి పైలెట్ మల్లేశ్వర్ ఆ సొమ్మును మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసుల సమక్షంలో అందజేశారు.