జాతీయ రహదారి పై ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన

 


ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ పథకాల ఎత్తివేతకు కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర.... ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్ తేజ 

విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి విఫలం...


ప్రైవేట్ విద్యాసంస్థల నిరవధిక బంద్ కు కారణం కాంగ్రెస్ ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలే....


అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జడ్చర్ల శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ధర్నా . ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్ తేజ మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ పథకాలను ఎత్తివేయటానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. స్వయంగా ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం వద్ద నయా పైసా లేవని వెల్లడించడం దీనికి బలాన్ని చేకూరుస్తున్నదని అన్నారు. గత ప్రభుత్వంలో అస్తవ్యస్తం అయిన విద్యావ్యవస్థను మా ప్రజాప్రభుత్వంలో గాడిలో పెడతామని, అధిక నిధులు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి 20 నెలల కాలం దాటినప్పటికీ 8500 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను అరిగోస పెడుతున్నదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారన్నారు. ఈ రాష్ట్రంలో పంచడానికి భూములు లేవు, చదువొక్కటే భవిష్యత్ను మారుస్తుంది, దానికోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తానని చెప్తున్న ముఖ్యమంత్రి గారు విద్యార్థులు రోడ్లు ఎక్కి తమకు స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, సర్టిఫికెట్స్ తీసుకోలేక పోతున్నామని, ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్నామని నిరసనలు చేస్తున్నా కూడా, వారిపై కేసులు పెడుతున్నారు తప్పితే వారి న్యాయమైన డిమాండ్ను నెరవేర్చట్లేదనీ, ఈ రాష్ట్రానికి 3 లక్షల 4 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉందని కేవలం విద్యారంగానికే 40000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించామని ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన ముఖ్యమంత్రి గారు విద్యా శాఖ నిధుల వాడకంపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధమా? అని అన్నారు. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిల కారణంగా డిగ్రీ కళాశాలలు బంద్కు పిలుపు నిచ్చాయని, సెమిస్టర్ పరీక్షలను సైతం బహిష్కరించాయని, ఇప్పుడు 15/09/2025 సోమవారం నుండి నిరవధిక బంద్ పాటించనున్నట్లు ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలు ప్రకటించాయని దీనికి పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని అన్నారు. ఈ ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలవల్ల పేద విద్యార్థుల బతుకులు రోడ్డుపాలవుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలు విడుదల చేసి, విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ABVP ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని, తర్వాత జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి యశ్వంత్, జిల్లా కళమంచ్ కన్వీనర్ అశోక్, నగర ఉపాధ్యక్షులు పాండు, విజయ్,దివ్య ,మహిళా కన్వీనర్ మైత్రి, సంయుక్త కార్యదర్శులు మహేష్, శ్రీను, ఎస్ ఫ్ ఎస్ ఇంచార్జి రోహిత్, ఖేల్ ఇంచార్జి దీపక్, సోషల్ మీడియా ఇంచార్జి రామ్ చరణ్ , కార్యవర్గ సభ్యులు విష్ణు, కురుమూర్తి, రాఘవేందర్, శివ కుమార్,గణేష్, నితిన్, మహేందర్, సందీప్ తదితర కార్యకర్తలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow