అన్నపూర్ణాదేవిగా శ్రీ బంగారు మైసమ్మ దేవత



జడ్చర్ల, సెప్టెంబర్ 24 : శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 3వ రోజు బుధవారం శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవతను అన్నపూర్ణ దేవిగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, అష్టోత్తర శతనామావళి, ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అన్నపూర్ణాదేవి అలంకరణను పురస్కరించుకొని దేవాలయం ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. పూజా కార్యక్రమంలో భక్తులు పోల శ్రీనివాసులు అరుణమ్మ దంపతులు, పరిగి దామోదర్ రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు గోనెల నరేందర్ మహేశ్వరి దంపతులు, గుండు చంద్రశేఖర్, విజయ్ కుమార్ గౌతమీ ప్రియాంక దంపతులు, యాదగిరి, గోనెల నరేష్ రాఘవేణి దంపతులు, నాగరాజు, మహిళా భక్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow