శ్రీ మహా చండి దేవిగా బంగారు మైసమ్మ తల్లి దేవత




జడ్చర్ల, సెప్టెంబర్ 28 : మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలో ఐబి బంగ్లా సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 7వ రోజు ఆదివారం శ్రీ మహా చండి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, అష్టోత్తర శతనామావళి, ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూజా కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు గోనెల నరేందర్ మహేశ్వరి, విజయ్ కుమార్ గౌతమీ ప్రియాంక, గుండు చంద్రశేఖర్ నాగమణి, యాదగిరి అనిత దంపతులు, నాగరాజు, భక్తులు హాసిని, రాహుల్, రాజేష్, రాకేష్, రామచంద్ర రావు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow