-----------------------------
మురికివాడలలో,ఇరుకు
ఇల్లలొ చితికిన బ్రతుకుల
నరకయాతన,దుర్భర జీవితపు అభాగ్యులను ఆదుకొనగ రావయ్య
కడు పేదరికంతో,ఆకలి అంటూ అలమటిస్తూ ఆర్తనాదాలు చేస్తూ ఆందోళన చెందుతున్న నిర్భాగ్యులను ఆదుకొనగా రావయ్య ఆపద్బాంధవా?
అనాధలై అగచాట్లు పడుతూ,
అన్నం లేక ఆదరణ కరువై,
వీధుల పాలైన అన్నార్థులను ఆదుకొనగ రావయ్య
ముసలి అత్త మామలను
అవమానించే దయ్యాల్లాంటి
కోడండ్ల అహంకారం అనచగా
రావయ్య ఆపద్భాంధవా?
వ్యసనాలపాలై,అమాయకపు భార్యలను,భర్త పేరుతో వేపుకు
తినే దుర్మార్గులను శిక్షించగా
రావయ్య ఆపద్భాంధవా?
విద్యార్థినుల జీవితాలను, చెడగొట్టి,తలిదండ్రుల ఆశలను,అడియాసల పాలుచేసే,దుర్మార్గుపు,
రాక్షసులను అంతం చేయగ
రావయ్య ఆపద్భాంధవా?
మహనీయులు జన్మించిన
ఈ భూమిపైన పాపపు పనులు పెరిగిపోయే ధర్మస్థాపన కష్టమాయే ఇలాంటి మనుషులను మార్చగా రావయ్య ఆపద్బాంధవా?
డబ్బు అహంకారంతో అమాయక ప్రజల మానప్రాణాలను బలి తీసుకుంటున్న ద్రోహులను
అంతం చేయగా రావయ్య
ఓ ఆపద్బాంధవా?
🙏🙏
*వి.జానకి రాములు గౌడ్*
