హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంచలన నిర్ణయం ద్వారా 50% రిజర్వేషన్ సీలింగ్ (కోటా పరిమితి) ను సడలించడాన్ని టార్గెట్ చేస్తోంది. ఈ దిశగా ప్రత్యేక జీవో (గవర్నమెంట్ ఆర్డర్) జారీ చేయడానికి సిద్ధం అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ ను ప్రత్యేక జీవో ద్వారా అమలు చేయనుంది. ఈ జీవో జారీ చేస్తే, తెలంగాణలో బీసీ వర్గాలకు విద్య, ఉద్యోగాలు, పంచాయతీ ఎన్నికలలో మరింత ప్రాతినిధ్యం ఉంటుంది.
పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285(A) కు సవరణ:
పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285(A) లో సవరణలు చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సవరణతో బీసీ వర్గాలకు పంచాయతీ రాజ్ ఎన్నికలలో అధిక రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటుంది. ఈ సవరణ ద్వారా, బీసీ వర్గాలు ప్రాతినిధ్యం పెంచుకొని, వారికి మరింత స్థానం, అధిక అవకాశాలు కల్పించడానికి మద్దతు లభిస్తుంది.
Tags
Telangana