BIG BREAKING: తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

 

తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సుదీర్ఘ చర్చల అనంతరం.. బీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పలికింది. అన్ని పార్టీలు బీసీ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు త్వరలో కార్యరూపం దాల్చనుంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపిన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఎట్టకేలకు అసెంబ్లీ అమోదం తెలిపింది. పంచాయతీల్లో రిజర్వేషన్‌పై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిచింది. మంత్రి సీతక్క అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. బీసీ బిల్లుతో పాటు పంచాయతీరాజ్ యాక్ట్ 285Aను సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో ఆమోదం పొందాయి. 

9వ షెడ్యూల్‌లో చేర్చకపోతే బిల్లు అవ్వదని అంటున్నారు : కూనంనేని

  • 9వ షెడ్యూల్‌లో చేర్చకపోతే బిల్లు అవ్వదని అంటున్నారు : కూనంనేని
  • సంపూర్ణ మద్దతిస్తున్నామంటూనే 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు కలిసి పోరాటం చేస్తామని ఎందుకు చెప్పట్లేదు : కూనంనేని
  • జయలలిత పోరాటం చేయడం వల్లే రిజర్వేషన్లకు పీవీ అంగీకరించారు: కూనంనేని
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనేది విప్లవాత్మకమైన ముందడుగు : కూనంనేని
  • చట్టాల్లో లొసుగులు లేకుండా చేస్తే ఏ న్యాయవ్యవస్థ అడ్డురాదు : కేటీఆర్​

    • చట్టాల్లో లొసుగులు లేకుండా చేస్తే ఏ న్యాయవ్యవస్థ అడ్డురాదు : కేటీఆర్​
    • భావసారూప్యత లేకుండా ధ్యేయసారూప్యత ఉండాలని జయశంకర్‌ చెప్పేవారు : కేటీఆర్​
    • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్టీలకతీతంగా మనందరికీ ధ్యేయసారూప్యత ఉంది: కేటీఆర్​
    • ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ బిల్లుకు వంద శాతం మద్దతిస్తున్నాం : కేటీఆర్​
    • బీసీల రిజర్వేషన్ అంశంలో కేసీఆర్‌ ప్రభుత్వం సీలింగ్‌ విధించిందనడం శుద్ధ అబద్ధం : కేటీఆర్​
    • 15 రోజులు సభ నిర్వహించాలని కోరుతున్నాం : కేటీఆర్​
    • దిల్లీలో కాంగ్రెస్‌ ధర్నా చేస్తే మేం రాలేదంటున్నారు... మరి రాహుల్‌గాంధీ, ఖర్గే రాలేదు కదా? : కేటీఆర్​
    • డిక్లరేషన్‌ కాదు... డెడికేషన్‌ కావాలి: కేటీఆర్​
    • ఒకే ప్రభుత్వం ఐదు గొంతులతో మాట్లాడడం సరికాదు : కేటీఆర్​
    • 22 నెలల్లో సీఎం రేవంత్‌ 52 సార్లు దిల్లీ వెళ్లారు : కేటీఆర్​
    • ప్రధాని వద్దకు సీఎం రేవంత్‌రెడ్డి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి : కేటీఆర్​
    • బీసీ బిల్లు సాధన కోసం సీఎం దిల్లీలోనే ఆమరణ దీక్షకు కూర్చోమనండి.. మేం వద్దన్నామా? : కేటీఆర్​
    • చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లు సాధించేవరకు దిల్లీలోనే ఉంటానని రేవంత్‌రెడ్డిని చెప్పమనండి : కేటీఆర్​
    • ఏం చేయాలన్నా డిక్లరేషన్‌ కాదు... డెడికేషన్‌ కావాలి : కేటీఆర్​
    • ఏపీ నుంచి దిల్లీకి వెళ్తున్నా.. తిరిగి తెలంగాణతోనే రాష్ట్రంలో అడుగుపెడతానని కేసీఆర్‌ చెప్పారు : కేటీఆర్​
    • తెలంగాణ సాధించుకుని రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్‌ అడుగుపెట్టారు : కేటీఆర్​
    • అసెంబ్లీ ముందుకు జస్టిస్ పి.సి.ఘోష్‌ కమిషన్‌ నివేదిక

      • అసెంబ్లీ ముందుకు జస్టిస్ పి.సి.ఘోష్‌ కమిషన్‌ నివేదిక
      • జస్టిస్ పి.సి.ఘోష్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
      • జస్టిస్ పి.సి.ఘోష్‌ నివేదికపై సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో చర్చ
      • పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును బీఆర్‌ఎస్‌ స్వాగతిస్తోంది : కేటీఆర్​

        • పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును బీఆర్‌ఎస్‌ స్వాగతిస్తోంది : కేటీఆర్​
        • బీసీ బిల్లులకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ఉంటుంది : కేటీఆర్​
        • బీసీల కోసం గతంలో కేసీఆర్‌ అనేక పోరాటాలు చేశారు : కేటీఆర్​
        • ఓబీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌... నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కోరారు : కేటీఆర్​
        • తెలంగాణ మొట్టమొదటి స్పీకర్‌గా బలహీనవర్గాల బిడ్డ మధుసూదనాచారిని నియమించాం : కేటీఆర్​
        • తెలంగాణ మొట్టమొదటి మండలి ఛైర్మన్‌గా బలహీనవర్గాలకు చెందిన స్వామిగౌడ్‌ను నియమించాం : కేటీఆర్​
        • అడ్వకేట్‌ జనరల్‌ కూడా బీసీలను బీఆర్‌ఎస్‌ నియమించింది : కేటీఆర్​
        • బలహీనవర్గాలకు చెందిన బీఎస్‌ ప్రసాద్‌ను అడ్వకేట్‌ జనరల్‌గా కేసీఆర్‌ నియమించారు : కేటీఆర్​
        • 2021 జనగణనతో పాటు కులగణన చేయాలని బీఆర్‌ఎస్‌ కోరింది : కేటీఆర్​
        • కులగణనపై రాహుల్‌గాంధీ కంటే ముందే మాట్లాడింది కేసీఆర్‌ ప్రభుత్వమే : కేటీఆర్​
        • అసెంబ్లీ, మండలి, పార్లమెంటులో ఓబీసీ రిజర్వేషన్లు తీసుకోవాలని అప్పట్లోనే తీర్మానించాం : కేటీఆర్​
        • రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్‌ వేస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2010లో తీర్పు ఇచ్చింది : కేటీఆర్​
        • రాజ్యాంగ ధర్మాసనం తీర్పును అతిక్రమించే అధికారం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు : కేటీఆర్​
        • ఇప్పుడు మన ముందున్న మార్గం ఒక్కటే.. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలి : కేటీఆర్​
        • పార్లమెంటులో మెజారిటీ బీజేపీ, కాంగ్రెస్‌కే ఉంది.. మాకు లేదు : కేటీఆర్​
        • మాకు లోక్‌సభలో సభ్యులు లేరు.. రాజ్యసభలో నలుగురు ఉన్నారు : కేటీఆర్​
        • బీసీలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే అసెంబ్లీ పరిధిలోనే కాదు : కేటీఆర్​
        • పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుంది : కేటీఆర్​
        • 9వ షెడ్యూల్‌లో చేరిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది : కేటీఆర్​


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow