కోదాడ సీఎంఆర్ఎఫ్‌ చెక్కుల కుంభకోణం.. ఆరుగురి అరెస్ట్

 


ఆరోగ్య సమస్యలతో సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్న బాధితుల వివరాలు మార్చేసిన ముఠా ఆ డబ్బులను వేరే ఖాతాలకు మళ్లించి నొక్కేసిందని ఎస్పీ నరసింహ వివరించారు. గత కొంతకాలంగా సదరు ముఠా పలువురి సీఎంఆర్‌ఎఫ్‌ నిధులను కాజేస్తుందని గుర్తించారు. ఈ క్రమంలో కోదాడ నియోజక వర్గానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు కలిసి ముఠాగా ఏర్పడి మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


అయితే సీఎంఆర్ఎఫ్‌ చెక్కులు సంబంధిత ప్రజాప్రతినిధి కార్యాలయానికి చేరుకుంటాయి. అయితే వీటిని ఆయన కింద పనిచేసే సిబ్బంది పంపిణీ చేస్తామని చెప్పి తీసుకుంటుంది. ఆ తర్వాత అప్లై చేసుకున్నవారిని కాద‌‌ని ఇంటి పేరుకు దగ్గరగా పోలి ఉన్న వ్యక్తుల అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ నంబర్ మార్చి అసలు వ్యక్తి ఖాతాలో కాకుండా తమకు చెందిన ముఠాలోని ఓ వ్యక్తి ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ముఠా.. గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు డ్రా చేసుకుని వాటాలు పంచుకుంటున్నట్లు విచారణలో వెలుగుచూసిందని ఎస్పీ నరసింహ వివరించారు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow