తప్పు చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం .

 


తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు 

కొత్తపల్లి ఇసుకతో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కి ఎలాంటి సంబంధం లేదు 

నల్లకుంటను భూకబ్జా నుంచి కాపాడింది అనిరుద్ రెడ్డే

చౌడూరులో నేను కొన్న భూమిపై బిఆర్ఎస్ నేతలు తప్పుడు ఫిర్యాదులు చేశారు 


రాజకీయాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తే కోర్టుకు ఈడ్చి పరువు నష్టం వేస్తా 

నోట్: ఎమ్మెల్యే క్యాంప్ ఆఫసులో మీడియా సమావేశం ఎంతవరకు స బాబు.. ఇది కూడా అధికార దుర్వినియోగం కాదా..?

 జిల్లా కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే సోదరుడు దుశ్యంత్ రెడ్డి స్పష్ఠీకరణ


జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈరోజు వరకు ఇసుక రవాణాలో ఎక్కడా జోక్యం చేసుకోలేదని,, నల్లకుంట చెరువును కబ్జాల నుండి కాపాడిందే అనిరుధ్ రెడ్డి అని, నవాబుపేట మండలం చౌడూరు లో కొనుగోలు చేసిన 4.18 గుంటల భూమిలో ఎలాంటి వివాదాలు లేకపోయినా తనపై తప్పుడు ఫిర్యాదులు చేసారని ఎమ్మెల్యే సోదరుడు మాజీ జిల్లా అధికార ప్రతినిధి జనంపల్లి దుష్యంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హయాంలో 30 ఏళ్లు వెనక్కి పోయిన జడ్చర్ల అభివృద్ధిని అనిరుధ్ రెడ్డి 30 ఏళ్లు ముందుకు తీసుకుపోయారని కితాబిచ్చారు. మరో ముఫ్ఫై ఏళ్ల పాటు అనిరుధ్ రెడ్డి ఎమ్మెల్యే కొనసాగాలని జడ్చర్ల ప్రజలు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.


జడ్చర్ల కేంద్రంలో జనంపల్లి దుష్యంత్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి, ఇటీవలి కాలంలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగానే దుష్యంత్ రెడ్డి మాట్లాడుతూ, జడ్చర్ల నియోజకవర్గంలో తాను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని, ఏ విషయంలోనూ తప్పు చేయలేదని స్పష్టంగా చెప్పగలనని అన్నారు. కొందరు టిఆర్ఎస్ (బిఆర్ఎస్) పార్టీకి చెందిన వ్యక్తులు స్వలాభం కోసం నాపై ఆధారంలేని ఆరోపణలు చేసి, బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తప్పుడు ప్రచారాలు మూడు అంశాల ను గురించి తనపై తన సోదరుడు అనిరుధ్ రెడ్డి పై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. దీనిలో మొదటి అంశం కొత్తపల్లి వాగు ఇసుక తరలింపు విషయం గూర్చి కొందరు, ఎమ్మెల్యే గారి ప్రమేయంతో కొత్తపల్లి వాగు నుంచి ఇసుక తరలింపు జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి కొత్తపల్లిలో ప్రైవేట్ పట్టా భూమిలో సంబంధిత యజమానులు మైనింగ్ డిపార్ట్మెంట్ నుండి అనుమతి పొంది, జిల్లా కలెక్టర్ ద్వారా NOC తీసుకొని పూర్తిగా లీగల్‌గా ఇసుక తరలింపు చేయడం జరిగిందని చెప్పారు.ఇది ప్రైవేట్ భూమి ఎమ్మెల్యే గారికి ఏ విధమైన సంబంధం లేదని దుష్యంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రెండవది జడ్చర్ల నల్లకుంట భూకబ్జా ఆరోపణ,జడ్చర్లలో నల్లకుంట ఎక్కడుందో తనకు తెలియదని, దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అయిన రెండు నెలల్లోనే నల్లకుంట భూకబ్జా విషయంపై కలెక్టర్ గారికి లేఖ రాసి చర్యలు కోరారని, అధికారులు నోటీసులు జారీ చేయగా కబ్జాదారులు కోర్టుకు వెళ్లారని చెప్పారు. కోర్టు ఆదేశాలు వారికి వ్రాయతిరేకంగా రావడంతో అధికారులతో ఒక కమిటీ వేసి నల్లకుంట ఎఫ్టీఎల్ లో కబ్జా చేసిన కట్టిన ప్రహరీ గోడలు తొలగించారని, ఈ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరించారు. మూడవ అంశం భూమి వివాదం మరియు ప్రాణహాని ఫిర్యాదు,నా కంపెనీ గ్లోబలైన్ హాస్పిటలిటీ LLP pvt కంపెనీ పేరిట, సర్వే నెంబర్ల ప్రకారం 4.18 గుంటల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశానని,ఈ భూమికి పక్కన హైదరాబాద్ రైతులు 8 ఎకరాల భూమి కొనుగోలు చేశారు, ఈ రెండుె భూముల సర్వే నెంబర్లు ఒక్కటే నని చెప్పారు. దాని యొక్క ప్రహరీని చౌడూరు గ్రామానికి చెందిన బావిని శ్రీనివాసులు, బావిని రాజు, బావిని జనార్ధన్ , బావిని ఓంనాథ్, బిజ్జలి మధు, బిజ్జలి చంద్రయ్య, బిజ్జలి శీను, బిజ్జలి కృష్ణయ్య తొలగించినందుకు వారిపై రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ విషయంగా తనపై ఎలాంటి ఆరోపణలూ లేవని, కానీ కొందరు దురుద్దేశపూర్వకంగా జిల్లా ఎస్పీ, DIG, HRC వద్ద తన వల్ల ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై ఏ అధికారి విచారణకు పిలిచినా తాను హాజరుకాగలనని,ఈ 4.18 గుంటల భూమి విషయంలో తాను ఏదైనా తప్పు చేసినట్లు తేలితే, దానిని ప్రభుత్వానికి ఉచితంగా రాసి ఇచ్చేస్తాను” అని సవాల్ చేసారు.. ఇది ముమ్మాటికి రాజకీయ కుట్ర ప్రయత్నం, ఈ తప్పుడు ప్రచారాల వెనుక ఉన్నది బిఆర్ఎస్ నేతల కుట్రే, ఎమ్మెల్యే , నన్ను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఈ అపప్రథలు పుట్టిస్తున్నారన్నారు. ప్రజలు నిజానిజాలు అర్థం చేసుకుంటారని ఆశాభావంవ్యక్తం చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال