PM Kisan: రేపు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..!

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ శుక్రవారం బిహార్‌లో జరగనున్న భారీ బహిరంగ సభలో విడుదల చేసే అవకాశముందని ఓ జాతీయ వార్తా సంస్థ నివేదిక పేర్కొంది.

 పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ శుక్రవారం బిహార్‌లో జరగనున్న భారీ బహిరంగ సభలో విడుదల చేసే అవకాశముందని ఓ జాతీయ వార్తా సంస్థ నివేదిక పేర్కొంది. పీఎం కిసాన్‌ నిధులను ప్రతి నాలుగు నెలలకోసారి విడుదల చేస్తారు. చివర 19వ విడత నిధులను 2025 ఫిబ్రవరిలో విడుదల చేశారు. గతేడాది జూన్‌ వాయిదాను నెల ముగియక ముందే విడుదల చేశారు. అయితే ఈ సారి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. పీఎం కిసాన్‌ ద్వారా దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది.

Previous Post Next Post

نموذج الاتصال