*విద్యార్థులకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పుష్కలం*
డిగ్రీ కళాశాలలో ప్రవేశం కొరకు వేచిచూస్తున్న విద్యార్థులకు శుభవార్తను
*తెలంగాణ బొటానికల్ గార్డెన్ కు స్వచ్చందంగా 25 వేల రూపాయల విరాళం**
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వుంద్యాల బలకిష్టా రెడ్డి. శనివారం నాడు స్థానిక డా. బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డా. వేముల శ్రీనివాసులు వైస్ ప్రిన్సిపల్ డా.డి. నర్మద గారు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సులేమాన్ మొక్క ను అందజేసిస్వాగతం పలికారు. మొదటి సంవత్సరం లో చేరిన విద్యార్థుల కు ఏర్పాటు చేసిన ఒరియెంటేషన్ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. డిగ్రీ చదువుతో ఉన్నత ఉద్యోగాలు అనేకం ఉన్నాయని కాకపోతే విద్యార్థులు
నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. దేశం లో అనేక రంగాలలో ఉద్యోగ అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయని, వికసిత భారత్ లో భాగంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ ఉపాధి కల్పన లో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ప్రత్యేకంగా సముద్ర సంబంధిత విభాగాల్లో రాబోయే కాలంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని యువత వాటిని ఉపయోగించుకోవాలని కోరారు.. త్వరలో భారతదేశం ప్రపంచంలోనే 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా నిలుస్తుందన్నారు.
డిగ్రీ కళాశాలలో ప్రవేశం కొరకు వేచిచూస్తున్న విద్యార్థులకు శుభవార్తను అందించారు. ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత మరొక మారు డిగ్రీ కళాశాలలో ప్రవేశించడానికి అవకాశమిస్తామన్నారు. ఇప్పటి వరకు కళాశాలలో మొదటి సంవత్సరం లో ఎంత మంది విద్యార్థులు చేరినారు అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం కళాశాలలో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ బొటానికల్ గార్డెన్ కు స్వచ్చందంగా 25 వేల రూపాయలను విరాళం గా అందజేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి గా జిల్లా అభివృద్ధి లో తాను పాలుపంచుకుంటానని, తన వంతుగా ఈ విరాళం ఇస్తున్నానని తెలిపారు. తెలంగాణ బొటానికల్ గార్డెన్ అభివృద్ధి కి దాతలు సహకరించాలని, తద్వారా జీవవైవిధ్య పరిరక్షణకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి బొటానికల్ గార్డెన్ తెలంగాణ రాష్ట్రం లో మరెక్కడాలేదని మరికొంత కష్టపడితే గిన్నిస్ బుక్ లోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగావిద్యార్థుల కు పాఠాలు చెప్పడమే కాకుండా, గార్డెన్ అభివృద్ధి కి కృషి చేస్తున్న డా. సదాశివయ్య ను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ వేముల శ్రీనివాసులు వైస్ ప్రిన్సిపల్ డా. డి నర్మద అధ్యాపకులు రాఘవేందర్ రెడ్డి, డా. సదాశివయ్య, సులేమాన్, దోస్త్ కన్వీనర్ సురయ జబీన్, నరసింహులు, సతీష్ రెడ్డి నాగలక్ష్మి, వేణు, లెఫ్ట్నెంట్ రాజేశ్వరి, పుష్పలత, నరసింహారావు, వెంకటయ్య, ఆంజనేయులు, వెంకట్ రెడ్డి బోధనేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.