*
మహబూబ్ నగర్ జిల్లాలో పలు కొత్త తరహా సైబర్ నేరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజలు అవగాహనతో ఉండకపోతే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం. జిల్లా ఎస్పీ డి.జానకి ఐపీఎస్ మోసాలపై సూటిగా హెచ్చరిస్తూ, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
*ఈ మధ్యకాలంలో గుర్తించబడిన ముఖ్యమైన మోసాలు:*
*PM-KISAN YOJANA APK Fraud:* రైతులకు రూ. 6,000 అందించబడే పీఎం కిసాన్ పథకాన్ని అడ్డుపెట్టుకొని నకిలీ యాప్‌లు ద్వారా OTPలు తీసుకొని ఖాతాలో డబ్బు దోచుకునే మోసాలు జరుగుతున్నాయి.
*Part-Time Jobs / Meesho Frauds:* "Work from home", "Order rating jobs" పేరుతో లింకులు పంపించి ప్రారంభంలో డబ్బు ఇప్పించుకొని తర్వాత బ్లాక్ చేసే మోసాలు.
ఇంపర్సనేషన్ మోసాలు - బిల్లు చెల్లింపు మోసం: జలమండలి, విద్యుత్ శాఖ అధికారుల పేరిట ఫోన్ చేసి, బిల్లు చెల్లించకపోతే కరెంట్ కట్ చేస్తామని బెదిరించి, లింక్ పంపి డబ్బు దోచడం.
బెట్టింగ్ యాప్‌లు: IPL, లాటరీ, రీల్స్ బోనస్ పేరిట అక్రమంగా యాప్‌లలో పెట్టుబడి పెట్టించి డబ్బులు నష్టపెట్టడం.
*Digital Arrest / Cyber Slavery:* పోలీస్/CBI పేరుతో వీడియో కాల్ చేసి అరెస్ట్ చేయబోతున్నాం అంటూ బెదిరించి డబ్బులు లాగడం.
*Cyber Stalking:* యువతులపై ఆన్లైన్‌లో వేధింపులు, ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరించడం.
*Investments Frauds:* ఎక్కువ లాభాలు ఇచ్చేలా చెప్పి క్రిప్టో, షేర్స్ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా మోసం చేయడం.
*Courier Scams:* "Your parcel contains illegal items" అని నమ్మించి బెదిరిస్తూ డబ్బులు వసూలు చేయడం.
*Job Frauds:* ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగాల పేరుతో రిజిస్ట్రేషన్ ఫీజులు పేరుతో డబ్బులు తీసుకోవడం.
*Golden Hour & 1930 Importance:* మోసం జరిగిన వెంటనే మొబైల్ నెంబరు 1930 లేదా www.cybercrime.gov.in (NCRP పోర్టల్) లో ఫిర్యాదు చేస్తే బ్యాంకుల ద్వారా డబ్బును తిరిగి రికవరీ చేసే అవకాశం ఉంటుంది. ఇది "గోల్డెన్ అవర్"గా పరిగణించబడుతుంది.
*ప్రజలకు సూచనలు:*
అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే సమాచారం అందించండి.
అనుమానాస్పద లింకులు/కాల్‌లపై క్లిక్ చేయవద్దు.
వ్యక్తిగత బ్యాంక్ వివరాలు/OTPలను ఎవరికీ చెప్పవద్దు.
సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కి కాల్ చేయండి లేదా NCRP పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ....
"సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో మోసాలు చేస్తుంటారు. మీరు జాగ్రత్తగా ఉండటం వల్లే మీ డబ్బుని కాపాడుకోవచ్చు. మోసాలకు గురైతే వెంటనే పోలీస్‌ను సంప్రదించండి."