Anti National Content: కేంద్రం సంచలన నిర్ణయం.. అలాంటి కంటెంట్ చేస్తే జైలుకే..


 Anti National Content: దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ ఉండే వెబ్ సైట్లపై కూడా చర్యలు ఉండనున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలోని అత్యున్నతాధికారులు యాంటీ నేషనల్ పోస్టుల గురించి హోమ్ మినిస్ట్రీకి చెప్పారట. ‘తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే’ వారు దేశంలో ఎక్కువై పోయారు. ఈ దేశంలో ఉంటూ.. ఈ దేశం తిండి తింటూ.. ఇక్కడ సౌకర్యాలు అనుభవిస్తూ.. పక్క దేశాలకు సపోర్టు చేస్తున్న వారు చాలా మందే ఉన్నారు. సోషల్ మీడియాలో సొంత దేశానికి వ్యతిరేకంగా పోస్టులు సైతం పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధమైంది. కేంద్ర హోం శాఖ కొత్త పాలసీ తేబోతోంది. ఈ పాలసీ గనుక అమలైతే దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారికి చుక్కలు కనిపించనున్నాయి. ఈ పాలసీలో భాగంగా దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టే వీడియో, ఇతర కంటెంట్‌ను గుర్తించనున్నారు. వాటిని బ్లాక్ చేయనున్నారు. ఆ కంటెంట్ పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ ఉండే వెబ్ సైట్లపై కూడా చర్యలు ఉండనున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలోని అత్యున్నతాధికారులు యాంటీ నేషనల్ పోస్టుల గురించి హోమ్ మినిస్ట్రీకి చెప్పారట. ఈ నేపథ్యంలోనే కేంద్ర కొత్త పాలసీ తేవాలని చూస్తోందట.



 రంగంలోకి స్పెషల్ టీం

దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని, వ్యతిరేకంగా పని చేసే వారిని గుర్తించడానికి కేంద్రం ఓ టీమ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ టీమ్ దేశ వ్యతిరేక కార్యాకలాపాలపై దృష్టి పెడుతుంది. ఖలిస్తానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నులాంటి వారి ఖాతాలు కూడా ఇండియాలో బ్యాన్ అవ్వనున్నాయి. ఈ కొత్త పాలసీ కోసం సోషల్ మీడియా కంపెనీలతో పాటు అమెరికా ప్రభుత్వంతో కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Previous Post Next Post

نموذج الاتصال