*⚠️ సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసాలపై జిల్లా పోలీసుల హెచ్చరిక*
ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్త రకమైన మోసానికి పాల్పడతున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవాన్ల వైద్య పరీక్షల పేరిట డయాగ్నొస్టిక్ సెంటర్లను టార్గెట్ చేయడం ప్రారంభించారు.
ఈ మోసపు తంతు ప్రకారం, Mahabubnagar జిల్లాలో BSF జవాన్ల క్యాంప్ ఉందని నమ్మకంగా చెప్పుతూ, మా వద్ద 27 మంది జవాన్లు మెడికల్ చెకప్ చేయించుకోవాల్సి ఉందని, ఒక్కొక్కరికీ ₹3500 చొప్పున మొత్తం ఖర్చు అయ్యే వ్యయానికి మా ఆఫీస్ నుండి మీకు చెల్లిస్తామని, అందుకు గాను మీరు మాకు 50% నగదు అంటే ₹47,250 తక్షణం చెల్లిస్తే, రేపు టెస్టులు అయ్యాక మేము మీకు 50%+100% బిల్లు మొత్తం 1,41,750/- నగదును చెల్లిస్తామని హామీ ఇస్తున్నారు.
ఇందులో అత్యంత దారుణం ఏమిటంటే, జిల్లా పోలీసు అధికారుల పేర్లను కూడా వాడుకుంటూ నమ్మకంగా చూపుతున్నారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ పట్టణంలోని ఒక డయాగ్నొస్టిక్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని మోసం చేయడానికి యత్నించారు.
*📢 ప్రజలకు, డయాగ్నొస్టిక్ సెంటర్లకు విజ్ఞప్తి:*
ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 కు సమాచారం ఇవ్వండి.
అలాగే www.cybercrime.gov.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
ముందుగా నగదు డిమాండ్ చేసే మరియు అధికారి పేర్లను వాడే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండండి.
ఎటువంటి లావాదేవీలు చెయ్యకండి, సంబంధిత అధికారులతో ధృవీకరించుకుని నిర్ణయం తీసుకోండి.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. జానకి, ఐ.పి.ఎస్. మాట్లాడుతూ,
“సైబర్ మోసాలు రోజుకో కొత్త రూపంలో ప్రజలను మోసం చేసేందుకు జరుగుతున్నాయి. అందువల్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. పోలీసుల సహకారంతో మాత్రమే ముందడుగు వేయాలి.‘