చట్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన మహబూబ్నగర్ జిల్లా పోలీసులు

 


*విద్యార్థులకు చట్టాలపై అవగాహన – “ప్రజా భద్రత – పోలీసు బాధ్యత”లో భాగంగా పోలీసుల అవగాహనా కార్యక్రమం* 

మహబూబ్ నగర్ జిల్లాలో పోలీసు శాఖ ప్రత్యేకంగా చేపట్టిన “ప్రజా భద్రత – పోలీసు బాధ్యత” కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విజయవంతంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ సూచనల మేరకు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు విద్యార్థినులతో మమేకమై చట్టాలు, భద్రత, బాధ్యతలపై సుదీర్ఘంగా వివరించారు. డీఎస్పీ మాట్లాడుతూ –

▪️ “పోలీసుల ఉనికి మీ భద్రత కోసం – చట్టబద్ధంగా జీవించేవారికి భయం అవసరం లేదు.”

▪️ “వర్గాలు, విభేదాల మధ్య గొడవలు సమాజాభివృద్ధికి అడ్డుకులు.”

▪️ “రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు జీవితాంతం పోలీసు రికార్డుల్లో మచ్చగానే మిగులుతారు.”

▪️ “ఎన్నికల సమయంలో గందరగోళానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు – బైండోవర్ తప్పదు.”

▪️ “కేసుల్లో ఇరుక్కుంటే ఉద్యోగాలు, విదేశీ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.”

టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ ఏజాజుద్దీన్ మాట్లాడుతూ –

▪️ “మహిళల పట్ల గౌరవం తప్పనిసరి – వేధింపులపై కఠిన శిక్షలు ఉంటాయి.”

▪️ “చదువు వయసులో ప్రేమలు, మోహాలకు లోనవకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి.”

▪️ “షీ టీమ్ బాధితులకి కొండంత అండగా ఉంటుంది – ఎవరైనా వేధింపులకు గురైతే సమాచారం ఇవ్వండి.”

▪️ “సైబర్ మోసాలు, డ్రగ్స్, మద్యం, పేకాట వంటి వలలకు లొంగవద్దు ఇవి జీవితాన్ని నాశనం చేస్తాయి.”

▪️ “రోడ్డు భద్రత పాటించాలి – మద్యం సేవించి వాహనాలు నడపకండి.”

▪️ “ప్రభుత్వ పథకాల దుర్వినియోగం నేరమే – అక్రమ రేషన్ వ్యాపారాలు చేస్తే చర్యలు తప్పవు.”

జిల్లా ఎస్పీ డి. జానకి గారి సంకల్పం మేరకు –

“యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, సమాజ శాంతి భద్రతలకు పాలకులవ్వాలి. ప్రజలతో పోలీసుల భాగస్వామ్యం ద్వారా నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది.” అని విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో రెండవ పట్టణ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఏజాజుద్దీన్, కళాశాల ప్రిన్సిపల్ కౌసర్ జహాన్, ఎ ఎస్ఐలు సాయి నిర్మల, పోశెట్టి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, అధ్యాపకులు, సురక్ష కళాబృందం, AHTU, షీటీమ్ సభ్యులు పాల్గొన్నారు

Previous Post Next Post

نموذج الاتصال