- 2,01,116 మంది లబ్ధిదారులు
హైదరాబాద్ జిల్లాలో నూతన ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు) పంపిణీ చేసేందుకు ప్రభుత్వం షెడ్యూలు ఖరారు చేసింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి (రవాణా శాఖ) పొన్నం ప్రభాకర్ గౌడ్ చేతుల మీదుగా శుక్రవారం నుంచి నగరంలోని మూడు చోట్ల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు.
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ జిల్లాలో నూతన ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు) పంపిణీ చేసేందుకు ప్రభుత్వం షెడ్యూలు ఖరారు చేసింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి (రవాణా శాఖ) పొన్నం ప్రభాకర్ గౌడ్ చేతుల మీదుగా శుక్రవారం నుంచి నగరంలోని మూడు చోట్ల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు కొత్త రేషన్‌కార్డులను అర్హులకు పంపిణీ చేస్తారని తెలిపారు.
ముందుగా ఖైరతాబాద్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్(Khairatabad, Cantonment, Jubilee Hills) అసెంబ్లీ నియోజకవర్గాలలో అందజేస్తామన్నారు. కొత్త కార్డులు 55,378 ఉండగా, లబ్ధిదారుల సంఖ్య 2,01,116. ఇప్పటికే ఉన్న పాత రేషన్‌కార్డుల్లో 1,37,947 మంది అర్హులను చేర్చడం ద్వారా 2,32,297 మందికి లబ్ధి చేకూరుతుందని కలెక్టర్ తెలిపారు.
పంపిణీ చేసే కేంద్రాలు
- ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి బంజారాహిల్స్ రోడ్ 10లోని బంజారా భవన్‌లో ఉదయం 10 గంటలకు
- కంటోన్మెంట్ పరిధి జింఖానాగ్రౌండ్ ఎదురుగా ఉన్న బాలంరాయి లీ ప్యాలె్‌సలో మధ్యాహ్నం 12 గంటలకు.
- జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధి రహ్మత్‌నగర్, హబీబ్ ఫాతిమానగర్ కమ్యూనిటీ హాలు మధ్యాహ్నం 3 గంటలకు..
- 2వ తేదీన ఉదయం 10 గంటలకు అంబర్‌పేట నియోజకవర్గంలో, మధ్యాహ్నం 12 గంటలకు ముషీరాబాద్ నియోజకవర్గంలో, మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ ఉంటుంది.
- 3న చార్మినార్‌లో మఽధ్యాహం 12 గంటలకు, కార్వాన్‌లో 3గంటలకు, చాంద్రాయణగుట్ట నియోజకర్గాల్లో రేషన్ కార్డు ల పంపిణీ చేసేలా షెడ్యూలును ప్రభుత్వం ఖరారు చే సింది.