*"ప్రజల సమస్యలకే అధిక ప్రాధాన్యం – వృద్ధురాలిని స్వయంగా కలసిన ఎస్పీ డి. జానకి, ఐపీఎస్"*
ప్రజల సమస్యలకు చట్టపరమైన పరిష్కారాలు కల్పించేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే కార్యక్రమం ఓ విశ్వసనీయ వేదికగా మారుతోంది.
ఈ రోజు జరిగిన కార్యక్రమంలో, ఓ వృద్ధ మహిళ మెట్లు ఎక్కలేని పరిస్థితిలో ఉండటాన్ని గమనించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ , తనే ఆఫీస్ కిందికి వచ్చి ఆమెను వ్యక్తిగతంగా కలుసుకుని, ఆమె ఫిర్యాదును స్వీకరించి, వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి చర్యలు తీసుకోవడం జరిగింది.
ఈ ఘటన ద్వారా, పోలీసు శాఖ ప్రజల పట్ల చూపుతున్న మానవీయ దృక్పథానికి నిదర్శనం.
ఈ రోజు మొత్తం 13 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయని, ప్రతి ఫిర్యాదును సవివరంగా పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి, వేగవంతమైన పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, "పోలీసు సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలి. ప్రజల పట్ల మానవీయంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను తీవ్రంగా తీసుకుని తక్షణ న్యాయం అందించడమే మా లక్ష్యం,” అని పేర్కొన్నారు.
ప్రతి ఫిర్యాదు ఆన్‌లైన్‌లో నమోదు చేయబడుతూ, పరిష్కార స్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, గ్రీవెన్స్ డే వేదిక ప్రజల సమస్యలకు త్వరిత పరిష్కార మార్గంగా నిలుస్తోందని పేర్కొ
న్నారు.