రంగారెడ్డి జిల్లా: రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి బాబానగర్‌లో భారీ అగ్నిప్రమాదం (Major Fire Accident) జరిగింది. అగ్నిప్రమాదం జరగడంతో మంటలు దట్టంగా వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి అగ్నిమాపక అధికారులు చేరుకొని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. స్థానికులని సంఘటన స్థలం నుంచి దూరంగా పంపించి వేస్తున్నారు.
అయితే ఈ ప్రమాదంలో ఏలాంటి ప్రాణనష్టం జరగలేదని.. కానీ ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. ఎంతవరకు ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ప్లాస్టిక్ కంపెనీ కావడంతో మంటలు త్వరగా వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలో ఉన్న ప్లాస్టిక్ దానా మంటల్లో కాలి బుడిదైంది. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అయింటుందా..? లేదంటే ఇంకా ఏదైనా కారణలు ఉన్నాయా..? అనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవల వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags
Hyderabad