Yellamma Temple: కోరిన కోర్కెలు తీర్చే బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..

 


ఆషాడ మాసం వస్తుందంటే చాలు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌ నగర పరిధిలో బోనాల సంబురాల సందడి మొదలవుతుంది. నగరంలోని చిన్న పెద్ద అమ్మవార్లకు మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో బోనం సమర్పిస్తారు. అయితే భాగ్యనగరంలో ప్రధానంగా బోనాల జాతర జరిగే అమ్మవారి ఆలయాల్లో బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మ పోచమ్మ ఆలయం కూడా ఒకటి. బోనాల పండగ గోల్కొండ కోటలోని ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించడంతో మొదలవుతాయి.

ఆషాడ మాసం వచ్చిందంటే చాలు భాగ్య నగరంలోని బోనాల సందడి మొదలవుతుంది. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళికి తోలి బోనం సమర్పిస్తారు. అనంతరం హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కూడా బోనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. బోనాల సందర్భంగా ఇక్కడ కొలువైన అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో మహిళలు చేరుకుంటారు. ఈ పురాతన ఆలయంలో ఏ దేవతను పూజిస్తారు? ఈ ఆలయంతో సంబంధం వెనుక ఉన్న నమ్మకం ఏమిటో తెలుసుకుందాం.

దేవతని పూజిస్తారంటే.. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ప్రధానంగా ఆదిశక్తి శక్తివంతమైన రూపం అయిన ఎల్లమ్మ దేవికి అంకితం చేయబడింది. ఆమెను దుర్గ, కాళి,ఇతర దేవత రూపాల అవతారంగా భావిస్తారు. వ్యాధులు నివారణ, కోరికలు తీర్చడానికి, దుష్ట శక్తుల నుంచి రక్షణ ఇచ్చే దైవంగా భావించి భక్తులు ఆమెను పూజిస్తారు. దేవతతో పాటు కొన్ని అనుబంధ దేవతలను కూడా ఆలయంలో పూజిస్తారు. అయితే ఇక్కడ ప్రధాన దైవంగా ఎల్లమ్మ భక్తులతో పూజలను అందుకుంటుంది.


ఎల్లమ్మ దేవత ఎవరో తెలుసా? హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం తెలంగాణలోని అత్యంత పురాతన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం శక్తి రూపంగా, రేణుకా దేవి అవతారంగా పరిగణించబడే ఎల్లమ్మ దేవికి అంకితం చేయబడింది. రేణుకా దేవి పరశురాముడి తల్లి. హిందువుల విశ్వాసాల ప్రకారం రేణుకా దేవి త్యాగ గుణం ఉన్న దేవతగా భావిస్తారు. ఎల్లమ్మ బాధలను నాశనం చేస్తుందని, పేదరికాన్ని నిర్మూలిస్తుందని , కోరికలను నెరవేరుస్తుందని భక్తులు నమ్ముతారు.

Previous Post Next Post

نموذج الاتصال