పత్రిక స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలి జడ్చర్ల తహసిల్దార్ కార్యాలయంలో వినతి

 



జడ్చర్ల: సమాజంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్న జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టీ పత్రిక స్వేచ్ఛకు భంగం వాటిల్ల కుండా చూడాలని జడ్చర్ల విలేకరులు శుక్రవారం తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ తిరుపతయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జడ్చర్ల సీనియర్ రిపోర్టర్ కృష్ణ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా వార్తలు రాసి ప్రచురించిన జనం సాక్షి దినపత్రిక ఎడిటర్ ఏం ఏం రెహమాన్ పై పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం సరికాదని అన్నారు. పోలీసులు ఇప్పటికైనా పత్రికా యాజమాన్యాలపై, విలేకరులపై తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని లేదంటే భవిష్యత్ లో ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్చర్ల విలేకరులు శ్రీధర్, సత్తార్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال