జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. భారత వైమానిక రక్షణ దళాలు పాకిస్తానీ డ్రోన్లను నేలకూలుస్తున్నాయి. పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని, ఆకాశంలో మెరుపులు కనిపిస్తున్నట్లు ప్రజలు చెబుతున్నాయి. భయంతో పరుగులు తీస్తున్నారు. లైవ్ అప్ డేట్స్ తెలుసుకుందాం పదండి ...
భారత్-పాక్ మధ్య తక్షణ కాల్పుల విరమణ – ట్రంప్ కీలక ప్రకటన
తక్షణ కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రంతా చర్చలు జరిగాయని ఎక్స్ లో వెల్లడించారు. భారత్, పాక్ వెంటనే కాల్పులు ఆపేందుకు అంగీకరించినట్లు ప్రకటించారు. రెండు దేశాలు శాంతికి ముందడుగు వేశాయని అభినందించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 10 కి.మీ. పరిధిలో డ్రోన్లపై నిషేధం విమానాశ్రయం పరిధిలో జూన్ 9 వరకు డ్రోన్ల వినియోగంపై నిషేధం ప్రయాణికుల భద్రత దృష్ట్యా నిర్ణయం తీసుకున్నాం-సైబరాబాద్ సీపీ
ఈ నెల 13 న బీజేపీ భారీ తిరంగా ర్యాలీ
ఈ నెల 13 న బీజేపీ భారీ తిరంగా ర్యాలీ
మేము సైతం దేశం కోసం పేరుతో ర్యాలీ
మంగళవారం సాయంత్రం 5 గంటలకు ర్యాలీ ప్రారంభం
ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ
సైన్యానికి మద్దతుగా భారీ ర్యాలీకి బీజేపీ నిర్ణయం
తిరుమలలో ఆపరేషన్ గరుడ పేరుతో మాక్ డ్రిల్
తిరుమలలో ఆపరేషన్ గరుడ పేరుతో మాక్ డ్రిల్ …యాత్ర సదన్ 3 వద్ద ఆపరేషన్ గరుడ ను నిర్వహిస్తున్న బలగాలు. …టీటీడీ విజిలెన్స్, పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా మాక్ డ్రిల్. …ఉగ్రవాదులు చొరబడితే తీసుకోవాల్సిన చర్యలపై భక్తులకు అవగాహన కల్పించిన భద్రతాధికారులు.
ఇకపై ఉగ్ర దాడులను యుద్ధంగానే పరిగణిస్తాం: ప్రభుత్వ వర్గాలు
ఇక దేశంలో జరిగే ఉగ్రవాద దాడులను యుద్ధంగానే పరిగణిస్తామని భారత ప్రభుత్వ వర్గాలు హెచ్చరించాయి. అలాంటి ఉగ్ర దాడులకు యుద్ధరీతిలో ధీటైన సమాధానం చెబుతామని పాకిస్థాన్‌కు పరోక్ష హెచ్చరికలు చేసింది భారత్.
మురళీ నాయక్ అంత్యక్రియలకు పవన్, నారా లోకేష్, అనిత..
అమరావతి: ఆదివారం జరిగే అమర జవాను మురళీ నాయక్ అంత్యక్రియలకు హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనిత , సత్య కుమార్, కేశవ్, అనగాని. పాక్ కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలను అధికారిక, సైనిక లాంఛనాలు తో జరపనున్న ప్రభుత్వం.
Operation Sindoor: పాక్ సరిహద్దులో రైళ్ల రాకపోకలు రద్దు
పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో రాత్రిపూట రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ శనివారం ప్రకటించింది. పాక్ భారత భూభాగంపై మిస్సైల్స్ దాడులు జరుపుతున్న నేపథ్యంలో రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆపరేషన్ సింధూర్ లో కరుడుగట్టిన ఉగ్రవాదుల హతం
మే 7వ తేదీన సింధూర ఆపరేషన్లో ఐదుగురు ముఖ్య ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ వర్గాల వెల్లడి
లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ చెందిన ఉగ్రవాదులు ఐదుగురు ఉగ్రవాదులు హతం
1.ముదస్సర్ ఖాదియాన్ ఖాస్ ( అబూ జుందాల్) లష్కరే తోయిబాతో అనుబంధం
2.హఫీజ్ ముహమ్మద్ జమీల్. జైష్-ఏ-మహమ్మద్
3 మొహమ్మద్ యూసుఫ్ అజార్ @ ఉస్తాద్ జీ @ మొహమ్మద్ సలీమ్ @ ఘోసి సహబ్. జైష్-ఏ-మహమ్మద్
4. ఖలీద్ @ అబూ ఆకాషా, లష్కరే తోయిబా
5. మొహమ్మద్ హసన్ ఖాన్, జైష్-ఎ-మహమ్మద్
హతమైన ఐదుగురు ఉగ్రవాదుల్లో ఇద్దర ఉగ్రవాదులు జైషే ఎ మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు
మే 7వ తేదీ దాడిలో తన కుటుంబ సభ్యులు పది మందిని కోల్పోయినట్లు ఇంతకుముందే చెప్పిన మసూద్ అజహర్
భారత్ పై జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో ఐదుగురు ఉగ్రవాదుల పాత్ర ఉంది. ఆపరేషన్ సింధూర్ లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని అఖిల పక్ష సమావేశంలో వెల్లడించిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్