ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌బ్రేకింగ్‌ న్యూస్‌…! పరీక్షల్లో అవి పూర్తిగా బ్యాన్‌..

 

Telangana Inter Exams:


అసలు టెక్నాలజీ ఉపయోగించి ఆ కాపీయింగ్ ఎలా చేస్తున్నారో కనిపెట్టడం కూడా అంత సులువు కాదు. అందుకే పరీక్షల సమయం దగ్గర పడుతున్నప్పుడు, ఇటు పరీక్షలు నిర్వహించే వారికి, తల్లిదండ్రులకు కాపీయింగ్ పై పెద్ద టెన్షన్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ కి టైం దగ్గర పడుతుంది. విద్యార్థులందరూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. మార్చి ఐదు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు బోర్డ్ అని ఏర్పాట్లు చేసింది. అయితే ప్రభుత్వం కూడా పరీక్షలపై సమీక్ష నిర్వహించింది. ఇదంతా హైటెక్ యుగం టెక్నాలజీ చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు. అయితే టెక్నాలజీని మంచికి ఎంతగా వాడుతున్నారో చెడుకు కూడా అంతే సమానంగా, ఇంకో మాట చెప్పాలంటే ఓ మెట్టు ఎక్కువే వాడుతున్నారు. అయితే హైటెక్ కాపీయింగ్ అనేది ఈమధ్య మరీ పెరిగిపోయింది. పరికరాలతో కాపీయింగ్ సులువుగా చేసేస్తున్నారు. అసలు టెక్నాలజీ ఉపయోగించి ఆ కాపీయింగ్ ఎలా చేస్తున్నారో కనిపెట్టడం కూడా అంత సులువు కాదు. అందుకే పరీక్షల సమయం దగ్గర పడుతున్నప్పుడు, ఇటు పరీక్షలు నిర్వహించే వారికి, తల్లిదండ్రులకు కాపీయింగ్ పై పెద్ద టెన్షన్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ కి టైం దగ్గర పడుతుంది. విద్యార్థులందరూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. మార్చి ఐదు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు బోర్డ్ అని ఏర్పాట్లు చేసింది. అయితే ప్రభుత్వం కూడా పరీక్షలపై సమీక్ష నిర్వహించింది. సాధారణంగా పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, డిజిటల్ వాచీలు ఇవన్నీ పూర్తిగా బ్యాన్ చేశారు. ఇది ఎప్పటినుంచో అమల్లో ఉన్న అంశం. అయితే అన్ లాగ్ వాచ్ లు అదే మామూలు గడియారాలు చేతికి ధరించి ఎగ్జామ్స్ కు వెళ్ళవచ్చు అనేది గత సంవత్సరం వరకు ఉన్న నిబంధన. కానీ, ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోవడంతో ఎవరు ఎక్కడ ఎలా టెక్నాలజీతో కాపీకి పాల్పడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉండటంతో అనలాగ్ వాచ్ లను కూడా ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

(ఫిబ్రవరి 28)శుక్రవారం తెలంగాణ సిఎస్ శాంతి కుమారి పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా గతంలో ఇంటర్ విద్యార్థులకు చేతికి అనలాగ్ వాచ్ లను అనుమతించేవారు. ఇకనుంచి అవి కూడా బ్యాన్ చేయాలని సిఎస్ అధికారులకు సూచించారు. దీంతో మార్చి 5 నుంచి జరిగే ఇంటర్ ఎగ్జామ్స్ కి చేతికి ఎటువంటి గడియారం పెట్టుకున్న పరీక్ష హాల్లోకి అనుమతించరు. అయితే మూడు గంటల పరీక్ష రాసేటప్పుడు విద్యార్థులు టైం చూసుకుంటూ దాని అనుగుణంగా ఎగ్జామ్ రాస్తుంటారు. అందుకోసమే విద్యార్థులకు సమయం తెలిసే విధంగా ప్రతి 30 నిమిషాలకు ఒకసారి అలారం మోగించాలని దాంతోపాటు ఇన్విజిలేటర్లు కూడా ప్రతి అరగంటకి టైం చెబుతూ ఇప్పటివరకు ఎంత టైం గడిచిపోయింది.. ఇంకా ఎంత సమయం మిగిలి ఉంది.. అనేది విద్యార్థులకు చెప్పబోతున్నారు. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి చేతికి ఎటువంటి వాచీలు లేకుండా వెళ్లడం ఉత్తమం. అయితే ఎవరైనా పొరపాటున చేతికి గడియారం పెట్టుకుని వస్తే వాటిని అక్కడ భద్రపరిచేందుకు లాకర్ సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me