Student Missing: పదోతరగతి ఆరుగురు విద్యార్థులు ఆదివారం ఉదయం అదృశ్యమయ్యారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నెమలిపురి గురుకుల పాఠశాలలో జరిగింది. శనివారం రాత్రి జరిగిన వీడ్కోలు పార్టీలో కొందరు విద్యార్థులు మితిమీరి వ్యవహారించారు.
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఆరుగురు విద్యార్థుల అదృశ్యం కలకలం రేపుతుంది. అసలు విద్యార్థులు ఎటు వెళ్లారా అని ఉపాధ్యాయులు వెతుకుతున్నారు. అసలు విద్యార్థులు వెళ్లిపోవడానికి గల కారణాలపై ఉపాధ్యాయులు ఆరా తీశారు. అసలు విషయం తెలిసి వారికి ఏం చేయాలో పాలు పోవడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. కోదాడ మండలం దోరకుంట సమీపంలోని నెమలిపురిలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు కనిపించడం లేదు. రెండు రోజుల క్రితం పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. అయితే పార్టీలో పదిమంది విద్యార్థులు గొడవకు దిగారు. విద్యార్థులను ఉపాధ్యాయులు మందలించడంతో ఎవరికి చెప్పకుండా పరారయ్యారు. మధ్యాహ్నం భోజనం చేసిన దగ్గరి నుంచి కనిపించకుండా పోయారు. విద్యార్థులు ఎటు వెళ్లారోనని ఉపాధ్యాయులు వెతికారు. ఎంతకు వారి ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి విద్యార్థులు పాఠశాలలో కనిపించడం లేదని చెప్పారు. దీంత తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.ఎక్కడికి వెళ్లారో తెలియక భయాందోళనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉన్నారు. కోదాడ రూరల్ పొలీసులకు ప్రిన్సిపాల్ ఝాన్సీ ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కూడా విద్యార్థుల కోసం అన్వేషిస్తున్నారు. కుటుంబ సభ్యులను వారికి తెలిసిన బంధు మిత్రుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
Tags
Hyderabad