ఓ 50 ఏళ్ల మహిళ గుండెపోటుతో మరణించింది. కానీ దహన సంస్కారాలకు డబ్బులు లేని కారణంగా మృతదేహాన్ని ఆమె కుమార్తెలు ఇంట్లోనే 8 రోజుల పాటు ఉంచుకున్నారు. ఈ క్రమంలోనే వారు స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు. ఆ తర్వాత ఏమైందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని వారసిగూడ(Warasiguda)లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. లలిత అనే 50 ఏళ్ల మహిళ ఇంట్లో గుండెపోటుతో మరణించింది. అయితే దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో 8 రోజుల పాటు ఆమె మృతదేహం ఇంట్లోనే ఉండిపోయింది. ఆ మహిళ ఇద్దరు కుమార్తెలు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేశారు. ఆమె మృతిపట్ల స్పందించని కుటుంబ సభ్యులు దహన సంస్కారాలకు డబ్బులు లేని కారణంగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారని తెలుస్తోంది. ఆ క్రమంలో మహిళ ఇద్దరు కుమార్తెలు కూడా 8 రోజుల పాటు ఆమె మృతదేహంతోనే జీవించారు. పరిస్థితి గురించి..
ఈ క్రమంలోనే వారు సహాయం కోసం స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యే వారి దయనీయ స్థితి గురించి తెలుసుకుని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఆ తర్వాత వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఈ ఘటనపై స్పందించిన స్థానిక పోలీస్ అధికారులు, లలిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టమ్ కోసం పంపించారు. దీంతో పాటు వారి కూతుర్లను, కుటుంబ సభ్యులను విచారించడం ప్రారంభించారు. ఇంట్లోనే మృతదేహం ఉంచుకోవడం గురించి విచారణ చేస్తున్నారు. ఆ విషయాల గురించి కూడా..
అయితే అసలు ఈ విషయం గురించి ఆ కుమార్తెలు వారి కుటుంబ సభ్యులకు చెప్పారా లేదా, వారం రోజులకుపైగా ఆ మహిళ మృతదేహం ఇంట్లోనే ఎలా ఉంచుకున్నారు. పక్కింటి వారు లేదా స్థానికులకు ఈ విషయం గురించి తెలుసా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. మృతదేహాన్ని ఇంట్లో ఉంచుకుని ఆ కుమార్తెలు వారం రోజులకుపైగా అనుభవించిన ఇబ్బందుల గురించి స్థానికులు అనేక విధాలుగా చర్చిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ నేపథ్యంలో త్వరలో మరింత సమాచారం తెలియనుంది.