*పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి*
*-మృతులు అక్క తమ్ముడు గా గుర్తింపు మహేష్ మృతదేహం లభ్యం భాగ్యలక్ష్మి కొరకు గాలింపు*
*-జడ్చర్ల మండలం ఉదండాపూర్ లో ఘటన*
జడ్చర్ల :
జడ్చర్ల మండల పరిధిలోని ఉదండాపూర్ గ్రామం శివారులో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కొరకు తీసిన గుంతలో ఇద్దరు చిన్నారులు లు పడి అక్క తమ్ముడు మృతి చేసిన ఘటన శనివారం మధ్యాహ్నం జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఉదండాపూర్ గ్రామానికి చెందిన ఆరెల యాదయ్య ఉదండాపూర్ ప్రాజెక్ట్ సమీపంలో వ్యవసాయ పొలం ఉంది శనివారం వ్యవసాయ పొలం వద్దకు తల్లితో కలిపి భాగ్యలక్ష్మి 6, మహేష్ 4 లు వ్యవసాయ కులం వద్దకు వెళ్లారు తల్లి వ్యవసాయ పనిలో నిమజ్జనం అయి ఉండగా ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ప్రాజెక్టు గుంతలో పడి మృతి వాతపడ్డారు కాసేపైనాక చిన్నారుల కొరకు తల్లి వెతకగా ప్రాజెక్టు గుంతలో మహేష్ అప్పటికే మృతి చెంది గా నీటిలో తేలాడుతూ కనిపించాడు దీంతో భాగ్యలక్ష్మి కొరకు వెతికిన కనపడకపోవడంతో స్థానికుల ద్వారా జడ్చర్ల పోలీసులకు సమాచారం అందించారు దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రెవెన్యూ సిబ్బంది భాగ్యలక్ష్మి కూడా నీటి గుంతలోనే పడి మృతి చెందిం ఉంటుందని భావించి భాగ్యలక్ష్మి కొరకు నీటిగుంటలో గాలింపు చర్యలు చేపట్టారు. యాదయ్య దంపతులకు ఉన్న ఇద్దరు సంతానం ప్రాజెక్టు గుంతలో పడి మృత్యువాత పడడంతో వారి రోధన వర్ణనాతీతంగా మారింది ఈ ఘటన ఉదండాపూర్ గ్రామం తో పాటు జడ్చర్ల మండలంలో విషాదఛాయలు నింపింది. కాగా ఉదండాపూర్ ప్రాజెక్ట్ గుంతలో ఇప్పటికే గ్రామానికి చెందిన గుంతలో పడి మూర్తి పడ్డారని ఆయన కూడా ప్రాజెక్ట్ గుత్తేదారుడు అధికారులు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతోనే గ్రామస్తులకు ప్రాజెక్ట్ గుంతలు జమపాశం గా మారాయని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.