తాండావాసుల దాహార్తిని తీర్చిన యువనేత అభిమన్యు రెడ్డి..

 


కొర్ర తండాలో సొంత ఖర్చులతో బోరు వేయించిన యువ నేత..


వేసవికాలం మొదలు కాకముందే ఎండలు మండుతున్నాయి... అటువంటి సమయంలో త్రాగునీటి కష్టాలు గ్రామాల్లో మొదలవుతాయని ముందుగానే గుర్తించిన బీఆర్ఎస్ యువ నాయకులు చించోడు అభిమన్యు రెడ్డి రాజాపూర్ మండల పరిధిలోని కొర్రతాండ గ్రామ పంచాయతీలో తన సొంత ఖర్చులతో వేయించిన బోర్ ను గురువారం మాజీ సర్పంచ్ లు, పలువురు నాయకులతో కలసి ప్రారంభించారు. 


అభిమన్యు రెడ్డి వేసిన బోరులో పుష్కలంగా నీరు రావాడంతో కొర్రతాండ వాసులు ఆనందం వ్యక్తం చేస్తూ అభిమన్యు రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 

మాజీ సర్పంచ్ హన్యా నాయక్, యువనాయకులు కొర్ర హాథీరాం, తావుర్య, కొర్ర పాండు, లింగ్యా తండా వాసులు, అభిమన్యు రెడ్డి యువసేన సభ్యులు, తదితరులు ఉన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me