ఈ శుభలేఖ చూడటానికి రెండు కళ్లు సరిపోవు.. అతిథులు షాక్..!


 

వివాహది శుభకార్యాలకు సామాజిక మాధ్యమాలు ద్వారా ఆహ్వానాలు పలికే నేటి రోజుల్లో హిందూ వివాహం విశిష్టత పెళ్లి మండపంలో జరిగే ఘట్టాలు వివరిస్తూ ఏకంగా ముప్ప్పై ఆరు పేజీల ఆహ్వాన పత్రికతో తన కూతురి వివాహానికి ఆహ్వానిస్తుంది కరీంనగర్ జిల్లా లోని ఓ కుటుంబం. వివాహది శుభకార్యాలకు సామాజిక మాధ్యమాలు ద్వారా ఆహ్వానాలు పలికే నేటి రోజుల్లో హిందూ వివాహం విశిష్టత పెళ్లి మండపంలో జరిగే ఘట్టాలు వివరిస్తూ ఏకంగా ముప్ప్పై ఆరు పేజీల ఆహ్వాన పత్రికతో తన కూతురి వివాహానికి ఆహ్వానిస్తుంది కరీంనగర్ జిల్లా లోని ఓ కుటుంబం. వెడ్డింగ్ కార్డు అందరిలా ఉంటే ఏం బాగుంటుందనుకున్నది ఆ కుటుంబం. వివాహ ఆహ్వాన పత్రికను పుస్తకం రూపంలో ప్రింట్ చేయించారు. వివాహానికి సంబంధించిన కళ్యాణ సంస్కృతి, పెళ్లిచూపులు, పాణిగ్రహణ శుభ ముహూర్త పత్రిక, పెళ్లి కుమార్తెను చేయుట, పెళ్లి కుమారుని చేయుట, వరపూజ, వధువును గంపలో తీసుకు వచ్చే తంతు, తెరసాల, కన్యా ఫలం, మాంగల్య పూజ, జిలకర బెల్లం, తలంబ్రాలు, బ్రహ్మముడి సప్తపది, ఉంగరాలు తీయించుట, అప్పగింతల పాట తోపాటు పెళ్లిలో జరిగే 36 తంతుల గురించి ఒక్కొక్క పేజీలో ముద్రించి తన కుమార్తె వివాహానికి అందరూ రావాలంటూ అందరినీ ఆహ్వానిస్తున్నారు సుద్దాల దంపతులు.

ఉన్నత చదువులు చదివిన వధువు కూడా తమ సంప్రదాయ సంస్కృతి ఆచరించి తన వివాహం చేయడం తనకు సంతోషంగా ఉండంటుంది. పెళ్లి పత్రికే ఈ రకంగా ఉంటే వివాహం ఎలా చేస్తారో అని ఆత్రుతగా చూస్తున్నారు బంధు మిత్రులు..ఈ పెళ్లి కార్డును ఆసక్తి చూస్తున్నారు. ఈ పెళ్లి కార్డును స్వయంగా అమ్మాయి తరుపున బంధువులు పంపిణి చేస్తున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me