ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి*

 ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి ఐపీఎస్ తెలిపారు*



 మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి ఐపీఎస్  ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు, విక్రయం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


*ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి*


జిల్లాలో అనుమతి లేకుండా ఇసుకను తరలించడం, అక్రమంగా నిల్వ చేయడం వంటి కార్యకలాపాలను నిరోధించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో దాడులు చేసి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.



*కఠిన చట్టాలతో కేసులు నమోదు*

ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ (PDPP) చట్టం, మైన్స్ అండ్ మినరల్స్ చట్టం (Mines and Minerals Act) ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

*ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి*

ప్రభుత్వ అనుమతులున్న వారికి మాత్రమే ఇసుక రవాణా, విక్రయించేందుకు హక్కు ఉందని, ఇతరులెవరైనా తాము సబ్‌ కాంట్రాక్టర్స్ అంటూ ఇసుక రవాణాకు పాల్పడితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ఇసుక అక్రమ రవాణా గురించి ప్రజలు సమాచారం అందించాలని, 100 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్పీ గారు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.


ప్రభుత్వ అనుమతి ఉన్న ఇసుక రీచ్‌లు, స్టాక్‌ పాయింట్ల భద్రతను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వెల్లడించారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి, నిఘా పెంచుతున్నామని తెలిపారు.


*హెచ్చరిక* .... ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే లేదా అధిక ధరలకు విక్రయిస్తే, వారిపై కఠిన సెక్షన్లు కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.జానకి ఐపీఎస్ గారు హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక లావాదేవీలు జరిపే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి అని

 స్పష్టం చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me