నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడ మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి రిలే నిరాహారదీక్షలు చేసేందకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారం (Mylaram) గ్రామం (Village)లో ఉద్రిక్తత (Tension) పరిస్థితి నెలకొంది. మైనింగ్ (Mining)కు వ్యతిరేకంగా గ్రామస్తుల నిరసన (Protest) కొనసాగుతోంది. అయితే రైతులు, గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అక్రమ అరెస్టులు ఆపాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి పోలీసులు రాకుండా కంచె ఏర్పాటు చేశారు. మైలారం గ్రామంలో ఉండే గుట్టపై క్వార్డ్జ్ ఖనిజాలను మైనింగ్ చేసేందుకు అనుమతులు లభించాయి. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా అక్కడ మైనింగ్ జరుగుతోంది. అనుమతుల నియమాలకు వ్యతిరేకంగా ఈ మైనింగ్ జరుగుతోందని పేర్కొంటూ గ్రామస్తులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేపట్టారు. మైనింగ్‌పై ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని, గ్రామ తీర్మానం కూడా ఫేక్‌గా సృష్టించి మైనింగ్ జరుపుతున్నారని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు.