Snacks: టెన్త్‌ విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం

 



ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు అందజేత

ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 కేటాయింపు

మధ్యాహ్న భోజన ఏజెన్సీల ద్వారా పంపిణీ

: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం వేళల్లో అల్పాహారం అందజేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనుండటంతో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు స్నాక్స్‌ అందిస్తారు. పాఠశాలల్లో వందశాతం ఫలితాలు సాధించేందుకు 3 వారాలుగా సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు చేపడుతున్నారు. విద్యార్థుల ఆకలి బాధలను దృష్టిలో ఉంచుకుని సాయంత్రం వేళల్లో అల్పాహారం అందించాలని నిర్ణయించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం వేళల్లో అల్పాహారం అందజేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.


11 కోట్ల రూపాయలు కేటాయింపు

ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున మంజూరు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లలో దాదాపు 2 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు చదువుకుంటున్నారు. 38 రోజులకు సంబంధించి ప్రతి విద్యార్థిపై రూ. 570 చొప్పున దాదాపు 11 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

రోజుకో రకం స్నాక్స్‌


స్పెషల్‌ క్లాసులు జరిగే 38 రోజుల్లో ఉడకబెట్టిన శనగలు, పెసర్లు, పల్లీలు-బెల్లం, మిల్లెట్‌ బిస్కెట్లు, ఉల్లిపాయ పకోడిలో రోజుకో రకాన్ని అందించనున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో మన్నన్‌ ట్రస్టు ద్వారా, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీల ద్వారా అల్పాహారం పంపిణీ చేయను



న్నారు

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me