💥 *సామాజిక కార్యకర్తకు సన్మానం*
💥 *సనాతన ధర్మాన్ని కాపాడడంపై హర్షం*
💥 *పురాతన దేవాలయాలకు ఉచిత పూజ సామాగ్రి పంపిణీ గొప్ప సంకల్పం*
💥 *పంపిణీ నిరంతరం కొనసాగించాలని కోరిన పురోహితులు, ఆలయ కమిటీలు*
గత నాలుగు సంవత్సరాలుగా పురాతన దేవాలయాలకు ఉచితంగా పూజ సామాగ్రిని పంపిణీ చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుతున్న *సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు దిడ్డి ప్రవీణ్ కుమార్* ను సన్మానించారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలో శ్రీ దత్త గురు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ దత్త గురు రామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమం చేపట్టారు.
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లానే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో సైతం తెలుగువారు నివాసముండే పురాతన దేవాలయాల్లో ప్రతిరోజు నిత్య పూజలు నిర్వహించేందుకు ఉచితంగా ధూప, దీప నైవేద్యాలని పంపిణీ చేయడం గొప్ప సంకల్పమని ఈ సందర్భంగా వారు తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ ని ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. సనాతన ధర్మాన్ని కాపాడడంపై హర్షం వ్యక్తం చేసిన పురోహితులు, ఆలయ కమిటీ సభ్యులు ఈ ఉచిత ధూప దీప నైవేద్యం పంపిణీ కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని ప్రవీణ్ ని కోరారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ పూజా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తానని తెలిపారు. దేవాలయాల్లో ప్రతిరోజు నిత్య పూజలు కొనసాగించలన్న నేపథ్యంలో పురాతన దేవాలయాలకు ఉచితంగా ధూప, దీప నైవేద్యాలని పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో కందనం, జమ్మి మొక్కలను ప్రవీణ్ నాటారు.
ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు వీరన్న, సహదేవ్, ఆగిరి వెంకటేష్ యాదయ్య, కృష్ణారెడ్డి, అశోక్, పూజరి తదితరులు పాల్గొన్నారు.