సికింద్రాబాద్ నుంచి కుంభమేళాకు 180 ప్రత్యేక రైళ్లు - టైమింగ్స్ తెలుసా? - MAHAKUMBHMELA 2025 SPECIAL TRAINS
మహాకుంభమేళాకు వేల సంఖ్యలో ట్రైన్స్ నడుపుతున్న రైల్వే శాఖ - తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం 180 ప్రత్యేక సర్వీసులు - సమాచారం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన రైల్వే సీపీఆర్వో శ్రీధర్
మహాకుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో రైళ్లు : కుంభమేళాకు దేశవ్యాప్తంగా సుమారు కోటి నుంచి రెండు కోట్ల భక్తులను చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. ఇవే కాకుండా ఐఆర్‌సీటీసీ తరఫున 'మహాకుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర' పేరుతో 2 భారత్ గౌరవ్ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఒకటి జనవరి 19న బయలుదేరగా, మరోకటి ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుందని ఆయన చెప్పారు.
దీనిని పూర్తిగా ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ కింద నడుపుతున్నట్లు తెలిపారు. ఇవి మూడు కేటగిరీలలో ఉంటాయన్నారు. ఆలయ దర్శనంతో పాటు పుణ్య స్నానాలు కూడా చేయిస్తారని తెలిపారు. వాటిలో భక్తులు ఉండేందుకు మంచి నాణ్యమైన సౌకర్యాలతో వసతులుంటాయని పేర్కొన్నారు మహకుంభ మేళాకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే 13వేలకు పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ రైళ్లను అందుబాటులో ఉంచినట్లు రైల్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 10 వేల రెగ్యులర్ సర్వీసులు, వాటికి అదనంగా మరో 3,100 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.
దక్షిణ మధ్య రైల్వే జోన్ 142 ప్రత్యేక సర్వీసులు, ఇతర జోన్ల నుంచి దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా మరో 40 రైళ్లను నడిపిస్తుంది. ఇక కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. కుంభమేళా ప్రత్యేక రైళ్లపై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వోతో ఈటీవీ భారత్ ముఖాముఖి. Special Train From Secunderabad to KumbhMela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్న కుంభమేళాకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును ప్రకటించింది. ఫిబ్రవరి 15న ఈ రైలు సికింద్రాబాద్‌లో బయలుదేరి తిరిగి అదే నెల 22న హైదరాబాద్ నగరానికి చేరుకుంటుంది. మొత్తం 8 రోజుల పాటు సాగే ఈ యాత్రలో వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్‌లను దర్శించుకునేందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ ప్యాకేజీని రూపొందించింది. ఎకానమీ క్లాస్‌లో పెద్దలకు రూ. 23,035, 11 ఏళ్ల లోపు పిల్లలకు రూ. 22,140గా టికెట్ ఛార్జీలను నిర్ణయించారు. 15 తేదిన సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు 18న యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటుంది.
19వ తేదిన వారణాసిలో కాశీవిశ్వనాథ్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలను భక్తులు దర్శించుకుని అదే రోజు ప్రయాణికులు అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం 20న అయోధ్య చేరుకుంటారు. అక్కడ శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హిని సందర్శించిన అనంతరం రైలు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. 22న రాత్రి వరకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్ (బరంపురం), చత్రపూర్, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసూర్ స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.