హైదరాబాద్లో సంచలనం రేపుతున్న అలకనంద ఆసుపత్రి అక్రమ కిడ్నీ మార్పిడి కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అలకనంద ఆస్పత్రి ఛైర్మన్ సుమంత్, మరో వ్యక్తి గోపి అరెస్టు చేసి జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఇప్పటికే సుమంత్, గోపి సహా మొత్తం 8 మంది పోలీసులు అదుపులో ఉన్నారు. ఈ రాకెట్ వెనకున్న వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు.
సీఐడీకి చేతికి అలకనంద కిడ్నీ రాకెట్ కేసు : రాష్ట్ర ప్రభుత్వం కిడ్నీ రాకెట్ కేసును సీఐడీకి అప్పగించింది. సీఐడీకి అప్పగిస్తూ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
గతంలోనూ కిడ్నీ మార్పిడీ శస్త్ర చికిత్సలు : కిడ్నీ రాకెట్ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి ద్వారా కొందరి పేర్లు, ఫోన్ నెంబర్లు సేకరించారు. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడీ శస్త్ర చికిత్సలు ఆరు నెలలుగా జరిగుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఒక్కో శస్త్రచికిత్సకు రూ.50 లక్షలు వసూలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
కిడ్నీ ఇచ్చిన వారికి ఇంకా డబ్బులు అందలేదు : డా.నాగేంద్ర - ALAKNANDA HOSPITAL KIDNEY RACKET
కిడ్నీ రాకెట్ అంశంలో మరింత విచారించాల్సి ఉందన్న డా. నాగేంద్ర - ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యక్షుడు డా. నాగేంద్రతో ఈటీవీ ముఖాముఖి Doctor Nagendra Interview On Alaknanda Hospital Kidney Racket : హైదరాబాద్ కిడ్నీ రాకెట్ అంశంలో శస్త్రచికిత్స అలకనంద ఆస్పత్రిలోనే జరిగిందా అనేది మరింత విచారించాల్సి ఉందని, ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నాగేంద్ర తెలిపారు. ఆస్పత్రి సీజ్ చేసినందు వల్ల లోతుగా దర్యాప్తు సాధ్యం కాలేదని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులున్న వారే లక్ష్యంగా బ్రోకర్లతో కలిసి దందాకు పాల్పడుతున్నట్లు వివరించారు. పోలీసులతో సమన్వయం చేసుకుంటూ విచారించి, తుది నివేదిక ఇవ్వాల్సి ఉందంటున్న డాక్టర్ నాగేంద్రతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
Tags
News@jcl