జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనేందుకు మంత్రి వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను చూసి మంత్రి కారు ఆపాలని డ్రైవర్ కు సూచించారు. దీంతోవెంటనే కారును నిలిపివేశారు. మంత్రి కాన్వాయ్ లోని ఇతర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం కాలేదు. అయితే కొద్దిసేపు అక్కడ ట్రాఫిక్ జాం అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర ఇరిగేషన్ పౌరశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో సంబంధించి ఎవరికి గాయాలు కాలేదు కానీ.. ఎనిమిది వాహనాలు ధ్వంసం అయ్యయి. హుజూర్ నగర్ నుంచి పాలకేడు నుంచి జాన్పహాడ్ దర్గాగు వెళుతుండగా.. ఎర్రడేపల్లి పోలీసు స్టేషన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆపే ప్రయత్నం చేశారు. వెంటనే ఉత్తమ కుమార్ రెడ్డి కాన్వే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో వెనక ఉన్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. పూర్తిగా ఆరు నుంటి ఎనిమిది వాహనాలు ఈ కాన్వాయి ప్రమాదానికి గురయ్యాయి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యకర్తలను పరామర్శించి మళ్లీ ఉర్సు ఉత్సవాలకు బయల్దేరా