దేవరకద్ర పట్టణంలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి



₹35 కోట్లతో వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసుకున్నాం.


సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసి, హాస్పిటల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.


యాక్సిడెంట్‌లలో గాయపడిన వ్యక్తుల ప్రాణాలు కాపాడేందుకు ప్రతి 30 కిలో మీటర్లకు ఓ ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు‌ చేయబోతున్నాం.


దేవరకద్రలోనూ ఓ ట్రామా కేర్ సెంటర్ రాబోతున్నది.



పేదలకు విద్య, వైద్యం, సామాజిక భద్రతను అందించే బాధ్యత ప్రభుత్వానిది.


ప్రభుత్వ విద్యా సంస్థలు, హాస్పిటల్స్‌లో అన్నిరకాల వసతులు కల్పిస్తున్నాం‌.


ఆరోగ్యశాఖలో సంవత్సర కాలంలోనే సుమారు 8 వేల ఉద్యోగాలను రిక్రూట్ చేశాం.


అన్ని రకాల మందులను, సర్జికల్స్‌ను, డయాగ్నస్టిక్స్ సేవలను అందుబాటులో ఉంచినం.


మహబూబ్‌నగర్ జనరల్ హాస్పిటల్‌లో కార్డియాలజి, నెఫ్రాలజీ వంటి అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రారంభించబోతున్నాం.


అలాగే,  త్వరలోనే ఎంఆర్‌ఐ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం.


డయాలసిస్ పేషెంట్లు ఇబ్బంది పడొద్దని, వారికి సమీపంలోనే డయాలసిస్ సేవలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.


ఏడాది కాలంలోనే కొత్తగా 18 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశాం.


దేవరకద్ర, మక్తల్‌‌కు కొత్తగా డయాలసిస్ సెంటర్లను మంజూరు చేశాం.


ఒక్కో డయాలసిస్ సెంటర్‌లో 5 చొప్పున, పది డయాలసిస్ మిషన్లను అందుబాటులోకి తీసుకొస్తాం.


ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేయాలని చూసే ప్రైవేట్ హాస్పిటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.


చట్టవ్యతిరేకంగా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసిన హాస్పిటల్‌ యాజమాన్యంపై కఠిన చర్యలకు ఆదేశించడం జరిగింది.


గ్రామసభల రూపంలో ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చాం. అధికారులే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటున్నారు.


అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, ఆత్మీయ భరోసా వంటి అన్ని పథకాలు అందజేస్తాం.


మీ పేర్లు జాబితాలో లేవని ఆందోళన చెందొద్దు.


మరోసారి దరఖాస్తుకు అవకాశం ఇస్తాం.


ప్రతి దరఖాస్తును పరిశీలించి,   ప్రతి పేద కుటుంబానికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటాం.


దశలవారీగా అర్హులైన అందరికీ ఇళ్లు, రేషన్‌కార్డులు ఇస్తాం.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me