పట్టపగలు ఏటీఎం వాహన సిబ్బందిపై దుండగుల కాల్పులు*

 *



హైదరాబాద్:జనవరి 16

డబ్బుల కోసం ఎంతటి దానికైనా తెగిస్తున్నారు దొంగలు.. ఇంతకుముందు ఇళ్లలోకి చొరబడి దొంగత నాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఏటీఎం సెంటర్లను టార్గెట్ గా చేసుకుని డబ్బులు కాజేస్తున్నారు. దోపిడి దొంగలు  


గతంలో చాలా ఘటనలు చూశాం.. ఏటీఎంలలో సీసీ కెమెరాలు తీసేసి, ఏటీఎం లో ఉన్న నగదును ఎత్తుకెళ్లిన ఘటనలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా.. ఏటీఎం బాక్సులకు బాక్సు లు దొంగలించిన ఘటనలు కూడా ఉన్నాయి. 


తాజాగా.. బీదర్ లో పట్టపగలే దారి దోపిడీకి పాల్పడ్డారు దుండుగులు. వివరాల్లోకి వెళ్తే…కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చి పోయారు. శివాజీ చౌక్‌లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బు లు పెట్టేందుకు వచ్చిన వాహనం సిబ్బందిపై కాల్పులు జరిపారు. 


బైకుపై వచ్చిన ఇద్దరు నిందితులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డు అక్కడి కక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి. అనంతరం నగదు పెట్టెతో దొంగలు పరారయ్యారు. 


అందులో రూ.93 లక్షల నగదు ఉన్నట్లు సమాచా రం. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయా నికి అతి సమీపంలో ఈ ఘటన జరిగింది. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి పరిశీలించారు. 


అనంతరం సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను వెతికే పనిలో పడ్డారు....

Previous Post Next Post

نموذج الاتصال