2023 ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటన నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో ఉంటున్న యూనివర్సిటీ విద్యార్థులు (ముదిరాజ్ వర్గానికి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఒక సమూహంగా ఏర్పడి)
ఈ కార్యక్రమాన్ని ఏ కుల సంఘానికి సంబంధం లేకుండా నిర్వహించబడుతుంది కావున ప్రతి ఇంటి నుండి ఇద్దరు తప్పక హాజరు కావాలని కోరుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల కేంద్రాలలో ముదిరాజుల హక్కులు అలాగే ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సమావేశం ఏర్పరుచుతున్నారు.
ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా బీసీడీలో ఉన్న ముదిరాజులను వెంటనే బీసీ ఏలోకి మార్చాలి. రాబోయే జెడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ ఎన్నికలలో ముదిరాజులకు సింహభాగం సీట్లు కేటాయించాలి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి అని కోరుతున్నారు.
ఈ సమావేశం రేపు ఉదయం 9:30 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జరుగుతుందని యూనివర్సిటీ విద్యార్థులు ఒక ప్రకటనలో తెలియజేశారు.