జడ్చర్లలో మండలం 50 లక్షల రూపాయల స్కాం

 



మాయ మాయ అంతా మాయ...

జడ్చర్లలో మండలం 50 లక్షల రూపాయల స్కాం ప్రముఖంగా వినపడుతున్న ఎమ్మార్వో లక్ష్మీనారాయణ పేరు

బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతో అవినీతి చేయడానికి దొరికిన ఏ చిన్న అవకాశాన్ని వదలని అప్పటి అధికారులు

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ భూ నిర్వాసితుల ఆర్.ఎన్.ఆర్ ప్యాకేజీ కింద కట్టించే ఇండ్ల స్థలం విషయంలో లక్షల్లో పైసలు గోల్మాల్. 

సర్వేనెంబర్ 426, 407 లో సుమారు 6 .20 గుంటల భూమి ఉంటది ఆ భూమి అంతా గైరాన్ భూమి. 

ఉదండాపూర్ లో సర్వం కోల్పోయిన వాళ్లకి ప్రభుత్వం తరఫున ఇండ్లు కట్టించడం కోసం చూసిన భూమి అది. 

ఊరిలో ఉన్న అందరి పేరు మీద రెండు గుంటలు రెండు గుంటలు రిజిస్ట్రేషన్ చేసి కృష్ణయ్య సన్నాఫ్ జంగయ్య గోపాల్ సన్నాఫ్ ఎర్ర నర్సింహులు ఇద్దరు తన పేరు మీద నాలుగు ఎకరాల ఈరో గుంటలు పట్టా చేయించుకున్నారు. 

రెండు గంటలు రెండు గుంటలు ఉన్నవాళ్లు అకౌంట్లో డబ్బులు పడ్డాయి నాలుగెకరాల 20 గుంటలు ఇంకా ప్రభుత్వం పేరు మీదనే ఉంది డబ్బులు పడలేవు అంటూ రోజులు వెల్లదీస్తూ వచ్చారు. 

ఊరికి సంజన కొందరు యువకులు కలెక్టర్ ఆఫీస్ ఆర్డిఓ ఆఫీస్ మండల తహసిల్దార్ కార్యాలయాలకు వెళ్లి వాకాపు చేయగా సుమారు 50 లక్షల రూపాయల పైసలు కృష్ణయ్య గోపాల్ అకౌంట్లో పడ్డట్లు ఆధారాలతో సహా తీసుకొచ్చి ఈరోజు ఊరిలో పెద్దమనుషుల ముందు పెట్టారు. 

అక్కడ ఉన్న పెద్ద మనుషులు మా గతంలో ఇక్కడ పనిచేసిన తాసిల్దార్ లక్ష్మీనారాయణకు ఇక్కడ పనిచేసిన గిర్ధవరి సుదర్శన్ రెడ్డికి డబ్బులు ఇచ్చామని మా దగ్గర డబ్బులు లేవు అని అంటున్నారు. 

ప్రభుత్వ గైరాన్ భూమి పైసలు ఇంత పెద్ద మొత్తంలో గోల్మాల్ అవడం వెనక ప్రభుత్వ అధికారుల హస్తం ఎంతవరకు ఉందని విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తామని దీనిపైన విచారణకు ఆదేశించేలా పోరాడుతామని గ్రామ యువకులు అంటున్నారు. 

ఎమ్మార్వో లక్ష్మీనారాయణ పైన గతంలోనే వేళల్లో ఫిర్యాదులు అందినప్పటికీ అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ ఇప్పుడు 50 లక్షల రూపాయల గోల్మాల్ వెనక ఎమ్మార్వో లక్ష్మీనారాయణ గిర్ధవరి సుదర్శన్ రెడ్డి హస్తం ఉందా లేదా అవినీతి ఎక్కడ ఎలా ఎంత జరిగిందనేది తేల్చాల్సింది ఇప్పుడు ప్రభుత్వమే.

Previous Post Next Post

Education

  1. TG EAPCET Results 2025 : నేడు తెలంగాణ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు విడుదల.... మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి - New!
  2. TG EAPCET Results 2025 : మే 11న టీజీ ఈఏపీసెట్‌ 2025 ఫలితాలు విడుదల - ర్యాంక్ ఎలా చెక్ చేసుకోవాలంటే...? - New!

نموذج الاتصال