తుపాకీరాముడిని మరిపిస్తున్న కౌశిక్‌రెడ్డి: మల్లు రవి


బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ప్రకటనలు చూస్తుంటే ఆయన పిచ్చి.. పరాకాష్టకు చేరినట్లనిపిస్తోంది. పీసీసీ పదవి కోసం రేవంత్‌రెడ్డి తన కాళ్లు పట్టుకున్నాడంటూ కౌశిక్‌ మాట్లాడడం.. ఆయన మతి స్థిమితం కోల్పోయాడని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇలాంటి ప్రకటనలతో ఆయన.. తుపాకీ రాముడిని మరిపిస్తున్నాడు’’ అంటూ కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ఎవరికీ లొంగని వ్యక్తిత్వం ఉన్న నేత అని, ఆయన గురించి తెలిసినవారు ఎవరూ ఇలాంటి ప్రకటనలు చేయరన్నారు. రేవంత్‌రెడ్డికి పదవులు.. ఆయన నిర్వహించిన ఉద్యమాలతో వరించాయే గానీ.. ఆయన ఎప్పుడూ పదవుల వెంట తిరగలేదన్నారు. దేనికైనా ఒక హద్దు ఉంటుందని, కౌశిక్‌రెడ్డిని కంట్రోల్‌ చేసే బాధ్యత ఆ పార్టీ పెద్దలదేనన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే జరగబోయే పరిణామాలకు ఆయన బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Previous Post Next Post

نموذج الاتصال