సత్యేశ్వర సేవా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం

 



ఆగస్టు 12 (నేటి శుభోదయ ప్రతినిధి) జడ్చర్ల: జడ్చర్ల సత్యేశ్వర సేవా ఆశ్రమం లోని అనాధలకు మానసిక మరియు దివ్యాంగులకు సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జడ్చర్ల సత్యం విద్యాలయం చైర్మన్ జీనురాల సత్యం , వారి సోదరులు జీనురాల చంద్రశేఖర్, మరియు జీనురాల ఉమేష్ రాజ్, వారి తల్లిదండ్రులు జీనురాల వెంకటమ్మ , నారాయణ , అశోక్, వర్ధంతి సందర్భంగా సుమారు 100 మంది అనాధలకు , దివ్యాంగులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆశ్రమం నిర్వాహకులు అన్నదాతలైన సత్యం, చంద్రశేఖర్ లను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా జీనురాల సత్యం, చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదని స్వర్గీయులైన మా మాతృ పితృ మూర్తులు మరియు మా సోదరుడు అశోక్ జ్ఞాపకార్థం అన్నదాన చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. పుట్టినరోజు వేడుకలు,పెళ్లిరోజు వేడుకలు అంటూ ఎన్నో వృధా ఖర్చులు చేస్తూ ఉంటాం, కానీ ఇలా ఆశ్రమంలో ఒక పూట అన్నదానం అందించి వారి ఆకలి తీర్చడం వలన ఎంతో పుణ్యం దక్కుతుందని అన్నారు. అభాగ్యులను, అనాధలను,వృద్ధులను, మతిస్థిమితం లేని వారికి ఆశ్రయం కల్పిస్తున్న సత్యేశ్వర సేవా ఆశ్రమం నిర్వాహకుల సేవలు ఎంతో గొప్పవని , ఆశ్రమ నిర్వాహకులకు తమ వంతు సహాయంగా బియ్యం, లేదా నిత్యవసర సరుకులు, కూరగాయలు గాని అందించి ప్రోత్సహించాలని అన్నారు. వివరాలకు శ్రీ సత్యేశ్వర సేవా ఆశ్రమం. బూ రెడ్డి పల్లి రోడ్డు , బాదేపల్లి ,జడ్చర్ల, నిర్వాహకులు చిత్తనూరి ఈశ్వర్ సెల్:9440860458.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me