కలెక్టర్ డీపీతో క్రియేట్ చేసిన ఫేక్ వాట్సాప్ అకౌంట్
మహబూబ్‌నగర్, ఆగస్టు 2: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమాయకులతో అందినకాడికి కాజేస్తున్నారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి వాట్సప్ డీపీతో శుక్రవారం నకిలీ అకౌంట్‌ను క్రియేట్ చేశారు. చాటింగ్ చేశారు. ఈ విషయాన్ని కొందరు కలెక్టర్ దృష్టికి తేవడంతో స్పందించిన ఆమె ఎస్పీ జానకి తెలిపారు. వెంటనే సంబంధిత అకౌంట్ ఫోన్ నెంబర్‌పై పోలీసులు దృష్టి పెట్టారు. ఎస్పీ జానకి మాట్లాడుతూ 94784605962 నెంబర్‌తో నకిలీ అకౌంట్‌ను సృష్టించారని తెలిపారు. ఈ నెంబర్ నుంచి కాల్ చేసిన, చాటింగ్ చేసిన వెంటనే పోలీసులకు చెప్పాలని కోరారు. సైబర్ నేరాల విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Tags
News@jcl