సీసీ కెమెరాలతోనే దొంగతనాలకు చెక్ పెట్టొచ్చు.

 సీసీ కెమెరాలు తోనే దొంగలకు చెక్ పెట్టొచ్చు. 



అనవసరమైన ఖర్చులు ఎన్నో పెడతాం. ఇంటి రక్షణ కోసం అలాగే పెరుగుతున్న దొంగతనాలకు చెక్ పెట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతుంటాయి. 

నిన్న వేములవాడ గుడిలో దొంగతనానికి విఫలయతనం చేసి సీసీ కెమెరాలను చూసి పారిపోయిన మహిళను మనం వీడియోలో చూసాం అంటే సీసీ కెమెరా పదిమంది సెక్యూరిటీ గార్డులకు సమానం.

సీసీ కెమెరాలకు రెండు లక్షల 20000 ఆర్థిక సహాయం చేసిన రియల్ వ్యాపారి హుస్నాబాద్ రామ్ రెడ్డి.

*జడ్చర్ల పట్టణం విద్యానగర్ కాలానికి చెందిన రియల్ వ్యాపారులు హుస్నాబాద్ రాంరెడ్డి, సూర్య ప్రకాష్ రెడ్డి లు దాదాపు 220000 రూపాయలతో కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ముందుకు వచ్చారు.


 జడ్చర్ల పట్టణ సీ ఐ ఆదిరెడ్డి సీసీ కెమెరాల ఏర్పాటును పరిశీలించారు. 

ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల పై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. కాలనిలోకి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చిన, చోరీలకు పాల్పడిన మరేదైనా నేరాలు జరిగిన అందుకు బాధ్యులైన వారిని ఇట్టే కనిపెట్ట వచ్చునని అన్నారు. పోలీసులకు సహకరించేందుకు ప్రజలు ముందుకు రావాలని వారి వారి కాలనీలలో కమిటీలు వేసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఇటీవల పట్టణంలోకి పలు కంపెనీల్లో ఉద్యోగాల కోసం కొత్తవారు వస్తున్నారని వారితో పాటే కొందరు నేరస్థులు వస్తున్నారని అందరినీ అనుమానించే పరిస్థితులు ఉండవు కాబట్టి అనుమానితుల కదలికలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించ వచ్చునని అన్నారు.

 విద్యానగర్ కాలానిలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ఆర్థిక సహకారం చేసిన రాంరెడ్డి,సూర్య ప్రకాష్ రెడ్డి లను ఆయన అభినందించారు. ఇలాగే మరికొందరు ముందుకొచ్చి ఇతర కాలనీలలో ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.*

Previous Post Next Post

نموذج الاتصال