జడ్చర్ల
మున్సిపల్ చైర్ పర్సన్ భవితవ్యం తేలేది రేపే.
చైర్ పర్సన్ పై
అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఉదయం
11:00 గంటలు
అవిశ్వాసాన్ని ఎదుర్కోవడమా, అవిశ్వాస తీర్మానానికి ముందే రాజీనామా చేయడమా
.......తేల్చుకోలేకపోతున్న చైర్ పర్సన్
అవిశ్వాసం నెగ్గితే
నూతన చైర్ పర్సన్ ఎవరు ?
.... ఆసక్తిగా ఎదురు చూస్తున్న జడ్చర్ల ప్రజానీకం
..........బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కే నూతనచైర్ పర్సన్ అవకాశాలు
కౌన్సిలర్లతో అంతర్గతంగా చర్చలు జరుపుతున్న ఆశావాహులు
విశ్వసనీయ సమాచారం మేరకు 20 మంది భారతీయ రాష్ట్ర సమితి జడ్చర్ల మున్సిపాలిటీ కౌన్సిలర్లు క్యాంపుకు తరలి వెళ్లారు.
బారాసకు చెందిన ఒక నాయకుడు వారిని తన ఫామ్ హౌస్ లో పెట్టినట్టు సమాచారం.
జడ్చర్ల పట్టణంలో సమస్యలు తాండవం చేస్తుంటే.. పాలకవర్గం తమకు పట్టనట్టు క్యాంపుకు వెళ్లిపోవడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురువానతో రోడ్లు, డ్రైనేజీలు, కుక్కల, సమస్యలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అవిశ్వాసం మాత్రమే పెట్టి అవిశ్వాసంలో టిఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రస్తుత చైర్మన్ ని దించివేసి చైర్మన్ ఎన్నికకు మరికొద్ది సమయం తీసుకుని ఆస్కారం ఎక్కువగా ఉంది.
ముందస్తుగానే చైర్మన్ పలానా వాళ్లు అని ఫిక్స్ అయితే కౌన్సిలర్లు అంతర్గత విభేదాలు వస్తాయని ఎవరికి వారుగా అవిశ్వాస తీర్మానం తర్వాతే చైర్మన్ పై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుత మున్సిపల్ చైర్ పర్సన్ అవిశ్వాస తీర్మానం .. వీగి పోయే అందుకు లోలోపల శాయశక్తుల ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
మరి ఏం జరుగుతుందో రేపు ఉదయం 11 గంటలకు తెలుస్తుంది .
