అవిశ్వాస తీర్మానంలో జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దొరపల్లి లక్ష్మి అవుట్

 నేడు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో చైర్ పర్సన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.



 అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది బీహార్ ఎస్ కౌన్సిలర్లు 5 మంది కాంగ్రెస్ ఒక బీజేపీ కౌన్సిలర్ సపోర్ట్ చేశారు. 

కావరం పెట్ లోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అవిశ్వాస పరీక్షకు ప్రెసిడెంట్ అధికారిగా హాజరైన మహబూబ్నగర్ జిల్లా ఆర్డీవో నవీన్ కుమార్ మాట్లాడుతూ అవిశ్వాస పరీక్షల్లో దూరపల్లి ఓడిపోయారు అని ఈ అవిశ్వాస పరీక్ష ఫలితాన్ని కలెక్టర్కు సమర్పించి తదుపరి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కలెక్టర్ విడుదల చేస్తారని అన్నారు. 

ఈ సందర్భంగా 24వ వార్డ్ కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ చైర్ పర్సన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు అలాగే ఇతర అవినీతి కార్యక్రమాల వల్ల అవిశ్వాస తీర్మానం పెట్టామని కౌన్సిలర్లు అందరం ఏకతాటిపై ఉండి అవిశ్వాసానికి అనుకూలంగా ఓట్లు వేసి మున్సిపల్  అవిశ్వాస తీర్మానంలో ఓడించామని అన్నారు.

రాబోయే కాలంలో జడ్చర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని త్వరలోనే కొత్త చైర్పర్సన్ ఎన్నిక ఉంటుందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సూచన మేరకు కొత్త చైర్ పర్సన్ ఎన్నిక త్వరలోనే ఉంటుందని అన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow