తాజాగా దిగిన అడవి నాటు పుట్టకొక్కులు...

 


కట్టకి వంద రూపాయలు మాత్రమే. నిరుడు వానల్లేక దొరకలేదుగానీ అంతకుముందు యేడైతే నలభై యాభైకి అమ్మారు... వీటినే మారు బేరగాళ్ళు కొనుక్కుపోయి కట్ట రెండొందల యాభై నుండి ఏరియానిబట్టి నాలుగొందల వరకూ అమ్ముకుంటున్నారంట... అంత డిమాండింగ్ ఉందిమరి. వీటిని సంపాదించాలంటేకూడా అంతే కష్టం ఉంటుంది మరి... తెల్లారేలోపునే అడవుల్లోకి పోవాలి. పురుగుపుట్రలనుండి తప్పించుకుంటూ పుట్లల్ని వెతికిపట్టి తవ్వి తీయాలి... భయంకరమైన పాములుంటాయి. అందరికీ సాధ్యమయ్యే సులువైన పనైతే కాదు.. మా యానాదులు మాత్రమే వీటిని తేగలరు. ఈ సీజన్లో మాత్రమే ఓ రూపాయి సంపాదించుకుంటారు..

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow