కలెక్టర్ కార్యాలయంలో నేడు గుండె పోటుతో...
సబ్ ట్రెజరీ ఆఫీసర్ టి. మోహన్ రాజు మృతి...
కుటుంబ సభ్యులను పరామర్శించిన
జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి
మహబూబ్ నగర్ జిల్లా డిస్ట్రిక్ట్ ట్రెజరీ
ఆఫీసులో సబ్ ట్రెజరీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న టి. మోహన్ రాజు (54) నేడు సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.
సోమవారం ఉదయాన్నే విధులకు హాజరైన మోహన్ రాజు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయలో గుండె పోటుతో ఇబ్బంది పడుతూ ఒక్కసారిగా కింద పడి పోయాడు.
కాసేపటికి ఇది గమనించిన కార్యాలయ సిబ్బంది మొహన్ రాజుని మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన మోహన్ రాజు మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయంలోని ట్రెజరీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. మోహన్ రాజు ఆకస్మిక మృతి విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లా జనరల్ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మహబూబ్ నగర్ ఇంటిగ్రేటెడ్ కార్యాలయంలో మోహన్ రాజు గుండెపోటుతో ఇబ్బంది పడుతూ కింద పడిపోయిన తీరు అంతా కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సీసీ కెమెరాలో రికార్డు అయింది.
ఈ వీడియోను చూసిన ఉద్యోగస్తులు అంతా కూడ కంటతడి పెట్టారు.
