వికారాబాద్ జిల్లా
తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న వెనుకబడేయబడ్డ ముదిరాజులకు రిజర్వేషన్ కల్పించి న్యాయం చేయండి
జనాభా ప్రాతిపదికన ముదిరాజుల రిజర్వేషన్ BC-D నుండి BC-A గ్రూపుకు మార్చిన జీవో ఎంఎస్ నె0. 15 తేది: 19-02-2009, పునరుద్ధరించి భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ-2023 అభయ హస్తం మేనిఫెస్టో, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వాగ్దానం ప్రభుత్వం ద్వారా అమలు చేయుట గురించి తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రిజిస్టర్ నెంబర్. 24/1954 గత 15 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముదిరాజుల యొక్క స్థితిగతులను పరిశీలించి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఉద్యమాల నేపథ్యంలో ముదిరాజులను బిసి-డి నుంచి బిసి-ఏ గ్రూపులోకి మార్చి జీవో ఎంఎస్ నెం. 15/ 2009 ద్వారా మార్చడం జరిగింది.
తెలంగాణ ప్రాంతంలో ముదిరాజులు అనేక సంవత్సరాలుగా సామాజిక, విద్యా, ఆర్థిక, ఉద్యోగ మరియు అన్నిరంగాలలో వెనకకు నెట్టివేయబడ్డారు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉద్యమంలో కూడా ముదిరాజుల ముందుండి పోరాటం చేసిన విషయం అందరికీ తెలిసిందే, జనాభాలో అత్యధిక శాతం మత్స్యకార వృత్తిపైన, తోటల పెంపకం పైన, కావల్ కారు వృత్తి పైన, ఆధారపడి విద్యా ఉద్యోగ రంగాల్లోనే కాక రాజకీయంగా కూడా చాలా వెనుకబడి ఉన్నారు
గౌరవ సుప్రీంకోర్టు తేదీ 11-10-2022వ రోజున తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ, (ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ) వేసిన కేసు నందు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ బీసీ కమిషన్, తెలంగాణ ప్రభుత్వము ఎలాంటి అలసత్వం లేకుండా వెనువెంటనే ముదిరాజుల రిజర్వేషన్ కు సంబంధించినBC-D నుండి BC-A గ్రూపు మార్పు చర్యలను చేపట్టగలరని తుది తీర్పు వెలువరించి ఉన్నారు.*కావున న్యాయ సంబంధమైన అన్ని అడ్డంకులు తొలగిపోయినందున తెలంగాణ బీసీ కమిషన్ మరియు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అలసత్వం లేకుండా ముదిరాజులను బిసి-డి గ్రూపు నుంచి బీసీ-ఏకు మార్చిన జీవో ఎంఎస్ నెం. 15 వెంటనే పునరుద్ధరణ చేయగలరని మనవి.
ఇటీవల భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు-2023లో అభయ హస్తం మేనిఫెస్టో, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో వాగ్దానం చేసిన విధంగా జిఓ ఎంఎస్ నెంబర్ 15 తేదీ 19-02- 2009 పునరుద్ధరణ, ముత్రాసి, ముదిరాజ్, తెనుగోళ్లు సామాజిక వర్గాలను ముదిరాజులను బిసి-డి గ్రూపు నుండి బీసీ-ఏ మార్పునకు కట్టుబడి ఉంటారని పూర్తి విశ్వాసంతో యావత్తు తెలంగాణ ముదిరాజ్ అందరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి హితోదికంగా కృషి చేసి గత ఎనిమిది నెలలుగా మీరు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని మేము ఆశించాం ఇప్పటికే అనేక విద్య ఉద్యోగ అవకాశాలలో అవకాశాలు కోల్పోతున్నాం కాబట్టి తొందరగా మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాము
అదేవిధంగా ముదిరాజుల అభివృద్ధికి ఈ కింది డిమాండ్ల ను నెరవేర్చాల్సిందిగా కోరుతున్నాం
ముదిరాజుల అభివృద్ధి కోసం ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఏర్పాటుకు ధన్యవాదాలు తెలియజేస్తూ దానికి సంఖ్యాపరంగా కూడా ఆలోచించి ప్రతి సంవత్సరానికి 1000 కోట్లు నిధులు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం
GOMS No. 98, 74,04 &15ల ప్రకారము చెరువు,కుంటలపై మాత్స్య సంపదపై తెలుగు, ముద్రాసి, ముదిరాజ్, బెస్త గంగపుత్ర మరియు గుండ్ల కులాలకు మాత్రమే హక్కులు ఉండే విధంగా మరియు మాత్స్య సొసైటీలో సభ్యత్వం సరళీకృతం చేసే విధంగా చట్టపరమైన ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరుతున్నాం
ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు సరిపడా నిధులు కేటాయించాలి అసంఘటిత రంగంలో కార్మికులుగా ఉన్నవారికి గుర్తింపు కార్డులు ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాం
వెనకబడిన తరగతులు మరియు ప్రత్యేకించి ముదిరాజులకు కేటాయించబడిన అసైన్డ్ భూములను పునరుద్ధరణ చేసి పట్టాదారు పాస్ పుస్తకంలో జారీ చేసి వారి హక్కులకు పూర్తి పటిష్టమైన చర్యలు చేపట్టాలి
కేంద్ర ప్రభుత్వానికి బీసీ క్రిమిలేయర్ విధానాన్ని ప్రత్యేకించి ముదిరాజుల గూర్చి తొలగించమని సిఫారసు చేయాలి
ఇతర బీసీ కులాలు, చేనేత కార్మికులకు, గౌడ కులస్తులకు, ఇస్తున్నట్లుగానే ముదిరాజ్ మత్స్యకారులకు 50 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పెన్షన్స్ సౌకర్యం కల్పించాలి
తెలంగాణలో మాత్స్య సహకార సంఘాలు 6000 పైగా ఉన్న అన్ని సొసైటీలకు 100% ఉచిత చేపల పిల్లల పంపిణీ చేయాలి
గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో ఉన్న ముదిరాజుల కొరకు ప్రత్యేక ముదిరాజ్ గురుకుల పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేయాలి
తెలంగాణ రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న ముదిరాజులకు రాజకీయ రంగంలో సరియైన ప్రాతినిధ్యం లేనందున చట్టసభల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల్లో మరియు కార్పొరేషన్లలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ ముదిరాజ్ , ప్రధాన కార్యదర్శి డి మాణిక్యం ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్కొడ నర్సింలు ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి ముకుంద నాగేశ్వర్ ముదిరాజ్, యాటకర్ల కృష్ణ ముదిరాజ్, ముకుంద వెంకటేష్ ముదిరాజ్ రమేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.