రైతును నేనేరా
నాగలిని భుజంపై ఎత్తుకున్న వాడు రైతు
పొద్దస్తమానం పొలము దున్ని విత్తనాలు వేసేవాడు రైతు కష్టపడి వ్యవసాయం చేస్తూ పట్టడన్నాన్ని మన కంచంలోకి అందించి ఆకలి తీరుస్తున్న వ్యక్తి రైతు కరోనా సమయంలో ప్రజలంతా ఇండ్లకే పరిమితమైతే తాను మాత్రం కరోనాను సైతం లెక్కచేయక సేద్యం చేసిన వాడే రైతు ప్రజలంతా ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని భయపడుతుంటే ధైర్యంగా నేనున్నాను అన్న వాడే రైతు ప్రభుత్వాలు ప్రజలు తనను గుర్తించిన గుర్తించకపోయినా అనునిత్యం ప్రజల కోసం పనిచేసే వాడే రైతు ఎంతటి కష్టానైనా ఇష్టంతో చేస్తూ అందరికీ అన్ని అందించే వాడే రైతు పిల్లా పాపలు మొదలుకొని కాటికి కాలుజాపిన ముసలి సైతం ప్రేమించే వ్యక్తి రైతు అందరి ఆకలి తీరుస్తూ తను ఉపవాసం ఉంటూ జీవితం గడిపే వాడే రైతు కళ్ళనుండి కన్నీళ్లు రాలుస్తూ ఎంత కష్టం వచ్చినా ఎవరికి చెప్పుకోకుండా మౌనంగా బధించేవాడే రైతు వ్యవసాయం చేయకుంటే తనకు తన కుటుంబానికి జీవనం గడవదని తెలిసి రాత్రింబగలు కష్టపడే రైతు
తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ అందరికీ అన్నం పెట్టే వాడే రైతు
29
విల్గొండ జానకి రాములు గౌడ్